దోశ విరిగిపోకుండా క్రిస్పీ గా కరకరలాడుతూ రావాలంటే ఇలా చేయండి     2017-11-17   19:27:02  IST  Lakshmi P

దోశలు విరిగిపోకుండా క్రిస్పీగా మంచి రుచితో రావాలంటే ఏమి చేయాలి. కొంతమంది మెత్తగా మృదువుగా ఉండే దోశ తినటానికి ఇష్టపడతారు. మరి కొంతమంది క్రిస్పీ గా కరకరలాడుతూ ఉండే దోశలను ఇష్టపడతారు. కొంతమందికి దోశ మీద గుడ్డు వేసుకుంటే ఇష్టపడతారు. అలాగే మరి కొంతమందికి కారం దోశ అంటే ఇష్టం. ఇలా ఒక్కొక్కరికి ఒకో రకమైన దోశ ఇష్టం. మరి ఈ దోశలను తయారుచేయటం ఎలా అని అనుకుంటున్నారా. చాలా సింపుల్. ఒక కప్పు మినపప్పు, పావు కప్పు పచ్చి శనగ పప్పు,రెండు కప్పుల బియ్యం,ఒక స్పూన్ మెంతులు అవసరం అవుతాయి. వీటిని శుభ్రంగా కడిగి ఉదయం నానబెట్టి సాయంత్రం మిక్సీ లో మెత్తగా రుబ్బుకోవాలి.

దోశ పిండిని మెత్తగా కాకుండా బరకగా కాకుండా సమంగా మిక్సీ చేయాలి. పిండి మిక్సీ చేసే సమయంలోనే ఉప్పు కూడా వేయాలి. ఈ పిండిని రాత్రంతా ఆలా ఉంచేయాలి. రాత్రంతా పిండిని ఆలా ఉంచటం వలన పిండి పిలుస్తుంది. పులిసిన పిండిలో మన జీర్ణక్రియకు అవసరమైన మంచి బ్యాక్టీరియా ఉంటుంది. దోశ పిండి ఉదయం కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది. ఈ పిండిని దోశ వేయటానికి అనువుగా కలుపుకోవాలి.పెనం బాగా వేడెక్కాక దోశ వేయాలి. అంతే క్రిస్పీగా మంచి రుచితో దోశ రెడీ అయినట్టే.

ఈ దోశ పిండి రుబ్బుకొనేటప్పుడు నానబెట్టిన అటుకులు,కొంచెం అన్నం కలిపితే స్పాంజి వలే మెత్తని దోశలు రెడీ అయ్యిపోతాయి. దోశ పిండిలో కొంచెం పంచదార వేస్తె దోశకు మంచి రంగు వస్తుంది. ఈ దోశకు కొత్తిమీర చెట్నీ,పుదీనా చెట్నీ లేదా పల్లీల చెట్నీ ఏదైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.