దోశ విరిగిపోకుండా క్రిస్పీ గా కరకరలాడుతూ రావాలంటే ఇలా చేయండి  

How To Make A Perfect Crispy Dosa At Home-

దోశలు విరిగిపోకుండా క్రిస్పీగా మంచి రుచితో రావాలంటే ఏమి చేయాలికొంతమంది మెత్తగా మృదువుగా ఉండే దోశ తినటానికి ఇష్టపడతారు. మరి కొంతమందక్రిస్పీ గా కరకరలాడుతూ ఉండే దోశలను ఇష్టపడతారు. కొంతమందికి దోశ మీగుడ్డు వేసుకుంటే ఇష్టపడతారు..

దోశ విరిగిపోకుండా క్రిస్పీ గా కరకరలాడుతూ రావాలంటే ఇలా చేయండి-

అలాగే మరి కొంతమందికి కారం దోశ అంటే ఇష్టంఇలా ఒక్కొక్కరికి ఒకో రకమైన దోశ ఇష్టం. మరి ఈ దోశలను తయారుచేయటం ఎలా అనఅనుకుంటున్నారా. చాలా సింపుల్.

ఒక కప్పు మినపప్పు, పావు కప్పు పచ్చి శనపప్పు,రెండు కప్పుల బియ్యం,ఒక స్పూన్ మెంతులు అవసరం అవుతాయి. వీటినశుభ్రంగా కడిగి ఉదయం నానబెట్టి సాయంత్రం మిక్సీ లో మెత్తగరుబ్బుకోవాలి.

దోశ పిండిని మెత్తగా కాకుండా బరకగా కాకుండా సమంగా మిక్సీ చేయాలి. పిండమిక్సీ చేసే సమయంలోనే ఉప్పు కూడా వేయాలి.

ఈ పిండిని రాత్రంతా ఆలఉంచేయాలి. రాత్రంతా పిండిని ఆలా ఉంచటం వలన పిండి పిలుస్తుంది. పులిసిపిండిలో మన జీర్ణక్రియకు అవసరమైన మంచి బ్యాక్టీరియా ఉంటుంది.

దోశ పిండఉదయం కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది. ఈ పిండిని దోశ వేయటానికి అనువుగకలుపుకోవాలి.పెనం బాగా వేడెక్కాక దోశ వేయాలి.

అంతే క్రిస్పీగా మంచరుచితో దోశ రెడీ అయినట్టే.

ఈ దోశ పిండి రుబ్బుకొనేటప్పుడు నానబెట్టిన అటుకులు,కొంచెం అన్నం కలిపితస్పాంజి వలే మెత్తని దోశలు రెడీ అయ్యిపోతాయి. దోశ పిండిలో కొంచెం పంచదావేస్తె దోశకు మంచి రంగు వస్తుంది.

ఈ దోశకు కొత్తిమీర చెట్నీ,పుదీనచెట్నీ లేదా పల్లీల చెట్నీ ఏదైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.