వేసవి కాలంలో జిడ్డు చర్మాన్ని వదిలించుకోవటానికి సులభమైన చిట్కాలు

How To Make A Homemade Face Pack For Oily Skin

వేసవి కాలంలో మండే ఎండలలో వేడి గాలులు,ఉక్కపోత, దాహం వంటి సమస్యలు ఉంటాయి.వీటితో పాటు చర్మం జిడ్డుగా బంకగా ఉంటే ఆ బాధ వర్ణనాతీతం.

 How To Make A Homemade Face Pack For Oily Skin-TeluguStop.com

ముఖాన్ని ఎన్ని సార్లు కడిగిన జిడ్డు కారుతూనే ఉంటుంది.అసలు జిడ్డు చర్మం కల వారికి కాలంతో పని లేకుండా ఏ కాలం అయినా జిడ్డు కారుతూనే ఉంటుంది.

జిడ్డు అనేది వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది.ఈ సమస్య నివారణకు కొన్ని ఇంటి చిట్కాలు వాటిని పాటిస్తే తొందరగా జిడ్డు సమస్య నుండి బయట పడవచ్చు.

#క్లెన్సర్

క్లెన్సర్ ను ఉపయోగించడం వల్ల ముఖంలో మంచి కాంతి వస్తుంది.సాలిసిలిక్ యాసిడ్ అధికంగా ఉండే క్లెన్సర్ ను ఉపయోగించాలి.

ముఖంలో ఎక్కువగా ఉన్న జిడ్డును సాలిసిలిక్ యాసిడ్ తొలగిస్తుంది.

#ఆల్కహాల్ తో రబ్ చేయాలి

కొంచెం ఆల్కహాల్ తీసుకొని ముఖానికి రాసి రబ్ చేయాలి.ఇలా చేయటం వలన ముఖానికి మంచి కాంతి రావటమే కాకుండా చర్మం పొడిగా మారకుండా ఉంటుంది.

#ఫేస్ మాస్క్

ముఖానికి ఫేస్ మాస్క్ వేయటం వలన జిడ్డును తొలగించుకోవచ్చు.సాలిసిలిక్ యాసిడ్ అధికంగా ఉన్న వాటినిఎంపిక చేసుకోవాలి.ఇవి చర్మంను పొడిగా,మృదువుగా మార్చుతుంది.

మంచి ఫేస్ మాస్క్ ను ఉపయోగించాలి.ఇది జిడ్డు చర్మాన్ని నివారిస్తుంది.

క్లే మాస్క్ అయితే జిడ్డు చర్మాన్ని నివారించటానికి సహాయపడుతుంది.

# మ్యాట్ ఫైయింగ్ ప్రైమర్

ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడూ ముఖంలో ఎక్కువగా ఉన్న జిడ్డును తొలగించటానికి మ్యాట్ ఫైయింగ్ ప్రైమర్ ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.ఇది ముఖంలో ఉన్న జిడ్డును తొలగిస్తుంది.అలాగే మేకప్ ఎక్కువ సేపు ఉండేలా చేస్తుంది.

#పాలు

జిడ్డు చర్మంతో పోరాటం చేయాలంటే పచ్చి పాలను చర్మ సంరక్షణలో ఉపయోగించాలి.పాలలో ఉండే మెగ్నీషియం చర్మంను క్లియర్ గా మరియు మృదువుగా మార్చుతుంది.

కాటన్ తీసుకుని పచ్చిపాలలో ముంచి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి.ఈ విధంగా ప్రతి రోజు చేస్తే చర్మం పొడిగా మరియు ఆరోగ్యంగా మారుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube