బరువు తగ్గి మళ్లీ పెరగకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే!  

అధిక బ‌రువు.నేటి కాలంలో ఈ స‌మ‌స్య‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది బాధ‌ప‌డుతున్నారు.

TeluguStop.com - How To Maintain Body Weight

బ‌రువు పెర‌గ‌డం సులువే.కానీ, త‌ర‌గ‌డం చాలా క‌ష్ట‌మ‌ని చెప్పాలి.

బ‌రువు త‌గ్గేందుకు స‌రైన డైట్ పాటించ‌డంతో పాటు చ‌మ‌ట‌లు చిందేలా వ్యాయామాలు చేస్తూ తీవ్రంగా శ్ర‌మించాల్సి ఉంటుంది.అయితే చాలా మంది ఎంతో క‌ష్ట‌ప‌డి బ‌రువు త‌గ్గిపోతారు.

TeluguStop.com - బరువు తగ్గి మళ్లీ పెరగకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కానీ, దాన్ని మెయింటెయిన్ చేయలేకపోతారు.అంటే అధిక బ‌రువు త‌గ్గిన‌ట్టే త‌గ్గి.

మ‌ళ్లీ పెరిగిపోతుంటారు.

అలా పెర‌గ‌కుండా ఉండాలంటే.

ఏం చేయాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా చాలా మంది చేసే పొర‌పాటు.

బ‌రువు త‌గ్గిపోయాక వ్యాయామం చేయ‌డం మానేస్తుంటారు.కానీ, అలా చేయ‌డం చాలా త‌ప్పు.

స‌మ‌యం లేక‌పోయినా రోజుకు క‌నీసం ఇర‌వై నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.అప్పుడు బ‌రువు అదుపులో ఉంటుంది.

ఆరోగ్యానికి కూడా మేలు జ‌రుగుతుంది.అలాగే ఎప్పుడు ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటే ఆహారం తీసుకోవాలి.

ఫైబ‌ర్ రిచ్ ఫుడ్ తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండి భావ‌న క‌లుగుతుంది.దాంతో వేరే ఆహారాల‌ను తీసుకోలేరు.ఫ‌లితంగా, వెయిర్ పెర‌గ‌కుండా ఉంటారు.ఇక చాలా మంది బ‌రువు త‌గ్గిపోయాం క‌దా అని.డైట్ ప్లాన్స్ వ‌దిలేస్తుంటారు.కానీ, అలా ఎప్పుడూ చేయ‌రాదు.

మీరు బ‌రువు త‌గ్గాల‌నుకునేట‌ప్పుడు ఎలాంటి డైట్ ప్లాన్ అయితే ఫాలో అయ్యారో.ఆదే డైట్ ప్లాన్‌ను త‌గ్గిన బ‌రువును మెయింటెయిన్ చేయాల‌నుకునే స‌మ‌యంలోనూ ఫాలో అవ్వాలి.

అప్పుడే మ‌ళ్లీ బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు.

ఇక బ‌రువు త‌గ్గించ‌డంలోనూ.

బ‌రువు పెర‌గ‌కుండా చేయ‌డంలోనూ వాట‌ర్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.రెగ్యుల‌ర్ నాలుగు లీట‌ర్ల వాట‌ర్ తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్ల‌డ‌మే కాదు.

ఆక‌లి కూడా త‌గ్గుతుంది.దాంతో తిన‌డం తగ్గిస్తారు.

ఫ‌లితంగా బ‌రువు కంట్రోల్‌లో ఉంటుంది.అలాగే ఒత్తిడి అధిక బ‌రువుకు ఒక కార‌ణంగా.

కాబ‌ట్టి, ఎప్పుడు ఒత్తిడికి దూరంగా ఉండాలి.మ‌రియు శ‌రీరానికి అన్ని పోష‌కాలు అందేలా చూసుకోవాలి.

జంక్ ఫుడ్‌, ఆయిల్ ఫుడ్‌, మ‌ద్యానికి దూరంగా ఉండాలి.

#Health Tips #Health #Good Health #Body Weight

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు