ఉదయం టిఫిన్ కు బదులు ఇది తీసుకుంటే పొట్ట లోని కొవ్వు కరిగిపోతుంది  

బార్లీ జావాను ఉదయాన్నే తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. ఈ విధంగా ఉదయం తీసుకోవటం వలన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. బార్లీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బార్లీని ప్రతి రోజు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే అధిక బరువు తగ్గటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా బార్లీ జావాను ఇంటిలోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.

బార్లీ జావా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో ఒక కప్పు బార్లీని తీసుకోని అందులో ఒక లీటర్ నీటిని పోసి 20 నిమిషాల పాటు మరిగిస్తే బార్లీలో ఉండే పోషకాలు నీటిలోకి చేరతాయి. ఈ బార్లీ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు రుచి కోసం నిమ్మరసం లేదా తేనే కలిపి త్రాగాలి. ఈ బార్లీ నీటిని ఉదయాన్నే పరగడుపున త్రాగాలి. ఇలా ఉదయాన్నే తీసుకోవటం వలన శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.

బార్లీ జావాలో యాంటీ ఇంఫ్లేమేటరీ లక్షణాలు కడుపులో మంట,గ్యాస్, ఎసిడిటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నివారిస్తుంది. ఉదయాన్నే బార్లీ జావా తీసుకోవటం వలన శరీరంలో హానికర కారకాలను,మలినాలను తొలగించి పెద్ద ప్రేగును శుభ్రం చేస్తుంది. బరువు తగ్గాలని అనుకొనే వారికీ దివ్య ఔషధం అని చెప్పవచ్చు. బార్లీ జావాలో ఉండే పోషకాలు శరీరంలో జీర్ణక్రియ రేటును పెంచి శరీరంలో కొవ్వును కరిగిస్తుంది .

అధిక బరువు సమస్య నుండి బయట పడటానికి బార్లీ నీరు బాగా సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకొనే వారు బార్లీ నీటిని క్రమం తప్పకుండా ఉదయం పరగడుపున తీసుకుంటూ ఉంటే మంచి ఫలితాలను పొందవచ్చు. రక్త సరఫరాను మెరుగుపరచి రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి బార్లీ నీటికి ఉంది.