డెలివరీ తర్వాత వచ్చే పొట్ట తగ్గాలంటే రోజుకి 5 నిముషాలు ఇలా చేస్తే సరి  

How To Lose Belly Fat After Pregnancy -

డెలివరీ అయ్యాక చాలా మందిలో పొట్ట భాగం,నడుము భాగంలో కొవ్వు పెరిగిపోయి అసహ్యంగా ఉండటమే కాకుండా బయటకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.ఇలా పెరిగిన పొట్టను తగ్గించుకోవటానికి చాలా ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.

కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన సరైన ఫలితం ఉండదు.చాలా మంది పొట్ట తగ్గటానికి విపరీతంగా డైటింగ్ చేసేస్తూ ఉంటారు.

How To Lose Belly Fat After Pregnancy-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

కానీ పొట్ట తగ్గకుండా నీరసం,నిస్సత్తువ రావటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట కండరాలు వదులుగా మారతాయి.

అందువల్ల డెలివరీ అయ్యాక పొట్ట ఉబ్బుగా,ఎత్తుగా,లూజ్ గా ఉంటుంది.మరల పొట్ట తగ్గి టైట్ గా మారాలంటే కొన్ని జాగ్రత్తలు,చిట్కాలు తప్పనిసరిగా తీసుకోవాలి.

పొట్ట తగ్గించుకోకపోతే ముందు ముందు ఎన్నో సమస్యలు వస్తాయి.అందువల్ల ఈ వీడియోలో డెలివరీ తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకోవటానికి కొన్ని సులభమైన చిట్కాలను తెలుసుకుందాం.

రెండు కప్పుల నీటిలోనాలుగు యాలకులు,ఒక స్పూన్ సోంపు వేసి బాగా మరిగించాలి.ఈ నీటిని వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి.అయితే ఈ నీటిని ఉదయం పరగడుపున త్రాగాలి.ఈ విధంగా పరగడుపున త్రాగటం వలన జీవక్రియ రేటు పెరిగి పొట్టలో కొవ్వు కరుగుతుంది.అంతేకాకుండా తల్లిపాలను పెంచటంలోనూ కూడా సహాయం చేస్తుంది.కాబట్టి ఈ చిట్కా తల్లి,బిడ్డ ఇద్దరికీ ఆరోగ్యపరంగా సహాయపడుతుంది.

ఈ నీటిని త్రాగిన పది నిమిషాల తర్వాత నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాసి పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కాపడం పెట్టటం వలన పొట్ట కండరాలు టైట్ గా మారతాయి.

ఇలా చేయటం వలన డెలివరీ తర్వాత వచ్చే స్ట్రెస్ మర్క్స్ కూడా తొలగిపోతాయి.ఈ విధంగా చేసిన తర్వాత పొట్టకు సంబందించిన వ్యాయామాలు 5 నుంచి 10 నిముషాలు చేయాలి.

ఈ విధంగా చేయటం వలన పొట్ట కండరాలు టైట్ గా మారటమే కాకుండా పొట్టలోని కొవ్వు కూడా కరుగుతుంది.చివరగా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.ఈ విధంగా ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తే ఒక నెలలోనే మీ పొట్టలో వచ్చిన మార్పును గమనించి ఆశ్చర్యపోతారు.
అయితే ఈ చిట్కాలను డెలివరీ అయినా మూడు నెలల తర్వాత మాత్రమే పాటించాలి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

How To Lose Belly Fat After Pregnancy Related Telugu News,Photos/Pics,Images..

footer-test