సోషల్ మీడియాలో ఉన్న అన్ని మాధ్యమాలలో వాట్సాప్ మొదటిది.ఇందులో అనేక రకాలుగా వ్యక్తిగత సమాచారానికి అనుకూలంగా ఉంటుంది.
ప్రస్తుతం వాట్సప్ వాడుకలో ముందు స్థానంలో ఉంది.ఇందులో రకరకాల ఫీచర్లు ఇదివరకే ఉండగా.
మరో ప్రైవసీ ఫీచర్ ను త్వరలోనే అందించనుంది.
ఇటీవలే వాట్సాప్ లో ప్రైవసీ ఫీచర్ ను అందివ్వగా.
అందులో రకరకాల అనుమానాలు ఎదురయ్యాయి.వాట్సాప్ లో చాట్ హిస్టరీ ఇతరులకు కనిపిస్తుందనే సందేహాలు అందరిలో కలిగాయి.
దీంతో వాట్సాప్ సంస్థ తమ సెట్టింగులను ప్రైవసీ లో ఉంచడానికి కొన్ని ఫీచర్లను తీసుకొచ్చింది.

ముందుగా వాట్సాప్ చాట్ ను ఇతరులు చూడకుండా ఉండటానికి వాట్సాప్ సెట్టింగ్ లో సెక్యూరిటీ ఫీచర్ ను ఎనేబుల్ చేయాలి.వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి.వెంటనే ప్రైవసీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని.
ఫింగర్ ప్రింట్ లాక్ పై క్లిక్ చేసుకోవాలి.ఇదే కాకుండా వాట్సాప్ లో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేయడానికి సెట్టింగ్స్ లోకి వెళ్లి అందులో అకౌంట్ పై క్లిక్ చేసి టూ స్టెప్ వెరిఫికేషన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
వెంటనే అది ఓపెన్ అవ్వగానే దానికి ఆరు అంకెల పిన్ ను టైప్ చేసుకోవాలి.దీని వల్ల ఇతరులు ఎవరైనా వాట్సప్ ఓపెన్ చేయాలనుకున్నా, ఇన్ స్టాల్ చేయాలనుకున్నా ఈ ఆరు అంకెల పిన్ కోడ్ అడుగుతుంది.
కాగా ఈ అంకెను గుర్తు పెట్టుకోవాలి.ఇతరులు వాట్సాప్ ను హ్యాక్ చేస్తే ఈ పిన్ కోడ్ అవసర పడుతుంది.
అంతేకాకుండా ఇటీవలే వాట్సాప్ యూజర్ లందరికీ స్టేటస్ ద్వారా ఈ విషయాన్ని తమ సంస్థ వెల్లడించింది.