శనీశ్వరుని కి నువ్వుల నూనెతొ దీపం ఎలా వెలిగించాలో తెలుసుకుందాం  

కొంత మందికి ఏదైనా పని ప్రారంభించినప్పుడు అనుకోని అవాంతరాలు ఏర్పడటం మరియు కొంత మందికి ఏలినాటి శని ప్రభావం ఉండటం చూస్తూ ఉంటాం. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ముందుకు సాగవు. ఎదో ఆటంకం, ఇబ్బందులు వాస్తు ఉంటాయి. అటువంటి వారు ఈ విధంగా చేయాలి.

ప్రతి గుడిలో నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల ముందు ప్రతి శనివారం నువ్వులనూనెతో దీపం వెలిగించాలి. అలాగే శనీశ్వరుడుకి బెల్లం అంటే ఇష్టం. అందువల్ల బెల్లంను నైవేద్యం పెడితే శనీశ్వరుని ప్రభావము తగ్గుతుంది.

అలాగే నల్లటి గుడ్డలో నల్లని నువ్వులను మూట కట్టి ప్రమిదలో వేసి వత్తులు వేసి దీపం వెలిగించిన శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాక నవ గ్రహాల చుట్టూ 9 ప్రదిక్షణాలు చేసి కాళ్ళు చేతులు కడుక్కొని శివాలయం లేదా ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి శనివారం చేస్తూ ఉంటె శని ప్రభావం తగ్గుతుంది.