పిల్లలు చేడు స్నేహాలు చేస్తే ఇలా కనిపెట్టండి

టీనేజ్ లో తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపలేరు.అయితే యవ్వనంలోకి రాకముందు, లేదా రెండు పదుల వయసు దాటాక తల్లిదండ్రుల మనసుని, మాటని అర్థం చేసుకుంటారు.

 How To Know That Your Kid Is In Bad Company?-TeluguStop.com

టీనేజర్స్ ని ఎక్కువ ప్రభావితం చేసేవి స్నేహాలే.మంచి స్నేహితులు దొరికితే దారిలో ఉంటారు.

అదే చెడు స్నేహాలు చేస్తే అడ్డదారులు తొక్కుతారు.మరి మీ పిల్లలు చేడు స్నేహాలు చేస్తే ఎలా కనిపెట్టాలి?

* మాటకి మాట సమాధనం చెప్పడం ఎక్కువ అయిపోతుంటే అన్ని సక్రమంగా జరగట్లేదనే విషయాన్ని గుర్తుంచుకోండి

* స్కూలుకి, కాలేజికి మామూలుగా ఉండే సమయాల్లో కాకుండా, వేరే సమయాల్లో వెళుతున్నట్లు చెప్పడం.లేట్ గా రావడం, లేదంటే త్వరగానే వచ్చేసి క్లాస్ లేదు, కాలేజ్ లేదు అని చెప్తారు.పిల్లలకు తెలియకుండా వారి చెబుతున్నది నిజమో కాదో కనిపెట్టాలి

* పిల్లల స్నేహితులు ఇంటికి వస్తున్నారో లేదో, సడెన్ గా రావడం మానేసారో, వారి మాటతీరులో, పద్ధతిలో తేడా ఉందో లేదో గమనించండి.

స్నేహితులు తడబడితే ఏదో జరుగుతున్నట్టే

* కుంటుంబంతో ఎక్కువ గడపకపోవడం.ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం, రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడం, చూపులు కలపకుండా మాట్లాడటం .ఇవి జరుగుతుంటే మీ పిల్లలు ఖచ్చితంగా చెడు సాంగత్యంలో ఉన్నట్టే

* ఇంటికి వచ్చిన వెంటనే దూరంగా ఉండి మాట్లాడితే నోటి నుంచి సిగరెట్ వాసన కాని, మద్యం వాసన కాని వస్తోందో లేదో చూడండి.తరచుగా వక్కపొడి, చూయింగ్ గమ్ నములుకుంటే వస్తే కూడా అనుమానించాల్సిందే

* ఇంట్లోంచి డబ్బులు మాయమవడం తరుచుగా జరిగితే, అది దాదాపుగా టీనేజర్స్ పనే.మీ కంటికి దొరికేలా పథకం వేయండి

తల్లిదండ్రులతో మాటల తగ్గిండంతో మొదలవుతాయి ఇవన్ని.కాబట్టి మీ పిల్లలకు మీ సమయాన్ని కేటాయించి, వారి సమయాన్ని కొద్దిగా తీసుకోని, వారితో గడపటం అలవాటు చేసుకోవాలి.

మరీ ముఖ్యంగా టీనేజిలో ఇది చాలా అవసరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube