ఆన్లైన్లో ఫోటోలను ఒరిజినలా, కాదా తెలుసుకోవాలంటే ఇలా చేయండి?

బహుశా అనేకమంది గూగుల్‌ నుంచి రకరకాల ఫోటోలను డౌన్‌లోడ్‌ చేస్తూ వుంటారు.ఎందుకంటే గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే కుప్పలు తెప్పలుగా మనకు కావలసిన ఫోటోలు కనిపిస్తుంటాయి.

 How To Know If Photos Online Are Original Or Not,  Online, Photis, Viral Latest,-TeluguStop.com

ఈ క్రమంలోనే ఆ ఫోటోలు ఒరిజినలా, కాదా? అనే విషయం చాలామందికి తెలియదు.అయితే మీరు గూగుల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే ఫోటోలు అసలైన ఫోటోలా, నకిలీవా? అనే విషయాన్ని చాలా తేలికగా తెలుసుకోవచ్చని ఎంతమందికి తెలుసు? అవును, గూగుల్‌లో కొన్ని ఫోటోలు గ్రాఫిక్స్‌తో తయారు చేసి ఉంటాయి.గ్రాఫిక్స్‌తో తయారు చేసిన ఫోటోలు ఎక్కువ శాతం రాజకీయ నాయకులు, సెలబ్రేటీలవి ఉంటాయి.అలాంటి ఫోటోలను చిన్న ట్రిక్‌ను ఉపయోగించి గుర్తించే అవకాశం ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఫోటోలను సెర్చ్‌ చేయడానికి ప్రధానంగా ఉపయోగించేది గూగుల్‌.గూగుల్‌ ఇమేజెస్‌ మనకు రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ ఆప్షన్‌ను అందిస్తుంది.

మనం ఏదైనా ఇమేజ్‌ వెతికినప్పుడు ఆ ఇమేజ్‌ విషయంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే గూగుల్‌ ఇమేజెస్‌కు వెళ్లి కెమెరా ఐకాన్‌ మీద క్లిక్‌ చేయాలి.మీరు చూసిన ఫోటో యూఆర్‌ఎల్‌ లేదా ఆ ఫోటోను నేరుగా అప్లోడ్‌ చేయాలి.

అప్పుడు వెంటనే గూగుల్‌ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందో.దాని మూలం ఎక్కడిదో మనకు పూర్తిగా తెలిసిపోతుంది.మీ ఆండ్రాయిడ్‌ పరికరంలో గూగుల్‌ రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ చేయడానికి మీరు రివర్స్‌ సెర్చ్‌ చేయాలనకుంటున్న ఫోటోలను సెలెక్ట్‌ చేసి దానిమీద రైట్‌ క్లిక్‌ చేయండి.అప్పుడు మీరు సెర్చ్‌ గూగుల్‌ ఫర్‌ ఇమేజ్‌ క్లిక్‌ చేస్తే గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలిసిపోతుంది.

ఇలా ఆ ఫోటో నకిలీదా.? లేదా అనే విషయాన్ని తెలుసుకునే వీలుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube