నిత్య పూజకి ఎలాంటి విగ్రహాలుండాలి?  

సాధారణంగా మనం అనేక రకాల లోహాలతో తయారుచేసిన విగ్రహాలను చూస్తూ ఉంటాంవీటిలో ఏ లోహంతో చేసినవి పూజలో పెట్టుకోవాలో అర్ధం కాదు. అయితే అందంగఉన్నాయని మార్కెట్ లో దొరికే చెక్క,మట్టి విగ్రహాలను నిత్య పూజలఉపయోగించకూడదు. అయితే మట్టి విగ్రహాలను వినాయచవితి,దసరా పండుగలలపూజిస్తాం కదా అనే అనుమానం రావచ్చు..

-

ఎందుకు నిత్య పూజలో మట్టి విగ్రహాలనపెట్టుకోకూడదో తెలుసుకుందాం.మట్టి విగ్రహాలను వినాయచవితి,దసరా పండుగలలో పూజించి ఆ తర్వాత నిమజ్జనచేసేస్తాం. కానీ ప్రతి రోజు పూజిస్తే వాటికీ పగుళ్లు వస్తాయి.

పగుళ్లవచ్చిన విగ్రహాలకు పూజలు చేయకూడదు. అందువల్ల బంగారం, వెండి, ఇత్తడి, కంచలోహాలతో తయారయిన విగ్రహాలను పూజలో పెట్టి పూజలు చేయవచ్చు.అయితే ఈ విగ్రహాలు చిన్నగా ఉండాలి.

గణపతిని మాత్రమే రాగితో తయారుచేసిందపూజించవచ్చు. స్ఫటిక విగ్రహాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కానీ అవమిగలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఉగ్ర స్వరూపం వున్న విగ్రహాలనపూజించకూడదు. చిన్ముద్రతో, అభయ హస్తంతో ఆశీర్వదిస్తున్నట్లుండవిగ్రహాలను పూజిస్తే మంచి జరుగుతుంది. మనం నమస్కారం చేసి కళ్ళు తెరవగానఇటువంటి విగ్రహాలను చూస్తే మనకి ఎనలేని ప్రశాంతత,ఎక్కడలేని ధైర్యలభిస్తాయి.