రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి       2018-06-11   02:31:48  IST  Lakshmi P

మన శరీరంలో విధులు జరగాలంటే ఎర్ర రక్త కణాల పాత్ర చాలా కీలకమని చెప్పాలి. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ ని కణాలకు సరఫరా చేస్తాయి. ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఆక్సిజన్ సరఫరాలో సహాయపడుతుంది. అందువల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గితే సమస్యలు మొదలు అవుతాయి. హిమోగ్లోబిన్ శాతం తగ్గితే అలసట, నీరసం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, తలనొప్పి వంటి లక్షణాలు తరచుగా కనపడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు కనపడగానే రక్త పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్ సూచన మేరకు మందులు వాడుతూ ఇప్పడు చెప్పబోయే ఆహారాలను తీసుకుంటే త్వరగా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

-

నారింజ, నిమ్మ, క్యాప్సికం, టమాటాలు, గ్రేప్ ఫ్రూట్స్ వంటి విటమిన్ సి అధికంగా ఉన్న పండ్లను తీసుకుంటే శరీరం ఆహారం నుండి ఐరన్ ని గ్రహించటానికి సహాయపడుతుంది. దాంతో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

ఐరన్ సమృద్ధిగా ఉండే ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, లివర్, పన్నీర్, కోడిగుడ్లు వంటి ఆహారాలను తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరిగి ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.

మన శరీరంలో ఎర్ర రక్తకణాలు పెరగాలంటే ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. కాబట్టి ఆకుపచ్చని కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు, పల్లీలు, అరటిపండ్లు వంటి ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఆహారాలను తీసుకోవాలి.

క్యాల్షియం, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉండే దానిమ్మను ప్రతి రోజు తీసుకుంటే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది. అంతేకాక శరీరానికి పోషణ కూడా లభిస్తుంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.