ఏడు రోజుల్లో మీ కళ్ళజోడు తీసి పక్కన పాడేయాలంటే...ఇలా చేయాలి

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చిన్న,పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కంటి చూపు తగ్గిందని కళ్లద్దాలు పెట్టుకుంటున్నారు.ఇలా ప్రతి నలుగురిలో ఒకరికి కళ్ళజోడు ఉండటం సాధారణం అయ్యిపోయింది.

 How To Increase Eyesight Naturally-TeluguStop.com

రోజు రోజుకి కళ్ళజోడు పెట్టుకొనేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.కానీ తగ్గటం లేదు.

సరైన ఆహారం తీసుకోకపోవటం వలన కంటి చూపు మందగిస్తుంది.టీవీ,ల్యాప్ టాప్,ఫోన్ కంప్యూటర్ వాడకం ఎక్కువ అవటం వలన పిల్లలు,పెద్దలు ఇలా ఇద్దరిలోను ఎక్కువ సైట్ కలిగిన కళ్ళద్దాలను వాడుతున్నారు.

ఎందుకంటే వీటిని ఎక్కువగా చూడటం వలన కంటి లోపలి నరాలు బలహీనం అవుతున్నాయి.

అయితే మన పూర్వికులు మాత్రం కళ్ళజోడు లేకుండానే సక్సెస్ గా జీవనాన్ని సాగించేవారు.

అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు,మారుతున్న జీవనశైలి కారణంగా శరీరంలో బలం లేకపోవటం,ఎముకలు బలహీనంగా మారటం,కంటి చూపు తగ్గటం, చిన్న పని చేసిన ఎక్కువ అలసట రావటం వంటివి కనపడుతున్నాయి.కళ్ళజోడు లేకుండా కంటి చూపును పెంచే అద్భుతమైన చిట్కా ఉంది.

ఈ చిట్కాను పాటిస్తే 100 % పనిచేస్తుంది.


ఈ చిట్కాకు బాదం,పటిక బెల్లం ,సోంపు అవసరం అవుతాయి.బాదంలో ఉండే పోషకాలు కంటి చూపును మెరుగుపరచటానికి సహాయపడటమే కాకుండా మెమొరీ పవర్ ని పెంచుతుంది.శరీరాన్ని ఆరోగ్యంగా,బలంగా మార్చుతుంది.

సోంపులో ఎమినో ఆమ్లాలు,యాంటీ ఆక్సిడెంట్స్,పోషకాలు సమృద్ధిగా ఉండుట వలన కంటి లోపల డేమేజ్ అయినా కంటి నరాలను రిపేర్ చేసి కంటి చూపును మెరుగుపరుస్తాయి.అంతేకాక కంటికి వచ్చే అన్ని రకాల సమస్యలను నివారించటానికి బాగా సహాయపడుతుంది.

పటిక బెల్లం శరీరంలో వేడిని తగ్గించి చల్లగా అయ్యేలా చేస్తుంది.

బాదం,పటిక బెల్లం ,సోంపు మూడింటిని సమానంగా తీసుకోని,బాదం,సోంపులను విడివిడిగా దోరగా వేగించుకోవాలి.

ఈ మూడింటిని మెత్తని పొడిగా చేసుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి.ఇలా తయారుచేసుకున్న పొడిని ఒక గ్లాస్ పాలలో పెద్దవారు అయితే రెండు స్పూన్లు,చిన్నవారైతే ఒక స్పూన్ పొడిని కలిపి త్రాగాలి.

ఈ విధంగా రోజులో రెండు సార్లు త్రాగితే ఒక నెలలోనే మీ కంటి చూపు మెరుగు అవుతుంది.కంటి చూపును పెంచటమే కాకుండా కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అంతేకాక మెదడు చురుకుగా ఉండేలా చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube