తెల్లని అందమైన గోళ్లు మీ సొంతం కావాలంటే....బెస్ట్ టిప్స్  

నిస్తేజంగా మరియు కళావిహీనంగా మారిన గోళ్లు మృదువైన చేతులను అందవిహీనంగా మారుస్తాయి. గోళ్లు నిస్తేజంగా మారటానికి విపరీతంగా గోళ్ళ రంగులను వేయటం మరియు మురికి పట్టటం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. ఒక్కోసారి గోళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. ఆలా మారిన గోళ్లను తెల్లగా మార్చుకోవటానికి సులభమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇవి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

-

నిమ్మరసం ఒక బౌల్ లో రెండు నిమ్మకాయల రసాన్ని పిండి దానిలో గోళ్లు మునిగేలా 10 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసంలో ఉన్న విటమిన్ సి గోళ్లను మెరిసేలా చేస్తుంది.

బేకింగ్ సోడా రెండు స్పూన్ల బేకింగ్ సోడాకు గోరువెచ్చని నీటిని కలిపి పేస్ట్ గా తయారుచేసుకోవాలి. ఆ పేస్ట్ గోళ్లకు రాసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. బేకింగ్ సోడాలో ఉండే మూలకాలు గోళ్లను తెల్లబరుస్తుంది.

టూట్ పేస్ట్ టూట్ పేస్ట్ ని గోళ్లకు రాసి సున్నితంగా 5 నిమిషాల పాటు మసాజ్ చేసి మరో పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

వైట్ వెనిగర్ ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ వైట్ వెనిగర్ వేసి బాగా కలిపి దానిలో గోళ్లను 5 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత గోళ్ళ క్రీమ్స్ ని రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.