దిష్టి అనేది నిజంగా ఉందా....లేదా అపోహ మాత్రమేనా ?  

Nara Dishiti-

సాధారణంగా పెద్దలు కానీ పిల్లలు కానీ డీలా పడిపోతే ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో దిష్టి (దృష్టి ) తగిలింది అనే మాటలు మనం తరచుగా వింటూనే ఉంటాం.దిష్టి తీయడం అనే ఆచారం పూర్వకాలం నుంచి వస్తోంది.

Nara Dishiti- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Nara Dishiti--Nara Dishiti-

బారసాల అన్నప్రాసన పుట్టినరోజు పెళ్లి వంటి వేడుకల్లో తప్పని సరిగా దిష్టి తీయటం మనం చూస్తూనే ఉన్నాం.అలాగే పిల్లలు ఏదైనా ఒక రంగంలో మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కూడా దిష్టి తీస్తుంటారు.

ఇలా పది మంది దృష్టిని ఆకర్షించిన వారందరికీ ఆయా కుటుంబ సభ్యులు దిష్టి తీస్తూనే వుంటారు.నరుడి కళ్లలో నల్లరాయి కూడా పగులుతుందని పెద్దలు అంటూ వుండటం ఇలాంటి సందర్భాల్లో మనం వింటూనే వుంటాం

Nara Dishiti- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Nara Dishiti--Nara Dishiti-

సాధారణంగా హారతి కర్పూరం వెలిగించి, సున్నం – పసుపు కలిపిన ఎరుపు రంగు నీళ్లతో దిష్టి తీస్తుంటారు.

ఎరుపు రంగు చూడటం వలన ఒక రకమైన ధైర్యం రావడమే కాకుండా, నీరసం నిస్సత్తువ రాకుండా మంచి ప్రభావం చూపుతుందని మన పెద్దవారు అంటూ ఉంటారు

చాలామంది ఒకే వ్యక్తిని కేంద్ర బిందువుగా చేసి చూసినప్పుడు, వాళ్ల నుంచి విద్యుత్ తరంగాలు ఆ వ్యక్తి శరీరాన్ని తాకుతాయి.అవి తన శరీరానికి వ్యతిరేకతను కలిగించినప్పుడు తల తిరగడం కడుపులో తిప్పడం వంటివి జరుగుతుంటాయి.

ఆ విద్యుత్ తరంగాలను చెదరగొట్టే ప్రక్రియలో భాగమే ఈ దిష్టి తీయడం అని చెబుతూ వుంటారు.

DEVOTIONAL