శరీరంపై స్ట్రెచ్ మార్క్స్ తొలగించటానికి.... అద్భుతమైన ఆయిల్స్  

  • పొట్ట, హిప్స్ మరియు తొడల ప్రాంతంలో చర్మం సాగటం వలన స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. ఇవి తొందరగా చర్మంలో కలిసిపోవు. అలాగే స్త్రీలు ఆపరేషన్లు చేయించుకున్న సమయంలో కూడా చర్మం మీద స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. స్ట్రెచ్ మార్క్స్ తొలగించుకోవడానికి ఎటువంటి క్రీమ్స్ వాడకుండా సహజసిద్ధమైన సుగంధ నూనెలతో తొలగించుకోవచ్చు. ఇప్పుడు ఆ నూనెల గురించి తెలుసుకుందాం.

  • -

  • రోస్ హిప్ సుగంధ నూనె

  • గులాబీ విత్తనాల నుండి తయారైన ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ లక్షణాల కారణంగా స్ట్రెచ్ మార్క్స్ కనపడకుండా చేయటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. మనం రోజు వాడే నూనెలో కొన్ని చుక్కల రోస్ హిప్ సుగంధ నూనెను వేసి కలిపి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే స్ట్రెచ్ మార్క్స్ తొందరగా తగ్గిపోతాయి.

  • జొజుబా సుగంధ నూనె

  • ఈ నూనెలో విటమిన్ A, E ఉండుట వలన స్ట్రెచ్ మార్క్స్ ని తొలగించటంలో చాలా బాగా పనిచేస్తుంది. ఈ సుగంధ నూనెలో ఆలివ్ ఆయిల్ కలిపి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే స్ట్రెచ్ మార్క్స్ తొందరగా తగ్గిపోతాయి.

  • లావెండర్ సుగంధ నూనె

  • ఈ నూనెలో మచ్చలకు వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు ఉండుట వలన తొందరగా మచ్చలను తొలగిస్తుంది. లావెండర్ సుగంధ నూనెను విటమిన్ E ఆయిల్ తో కలిపి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే స్ట్రెచ్ మార్క్స్ తొందరగా తగ్గిపోతాయి.