గడ్డం గీసుకున్నాక వచ్చే చిన్న చిన్న పొక్కులు చిరాకు,దురద,విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి.అంతేకాక ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది.
గడ్డం గీసుకున్నాక చర్మం మీద తగినంత తేమ లేకపోవుట వలన పొక్కులు వస్తాయి.ఇవి గిరజాల జుట్టు ఉన్నవారిలో ఎక్కువగా కన్పిస్తాయి.
చర్మం మీద మొటిమలు ఉన్న సమయంలో కూడా ఇన్ ఫెక్షన్ వచ్చి గడ్డలు వచ్చే అవకాశం ఉంది.ఇప్పుడు వీటిని ఇంటి నివారణల ద్వారా ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
1.వేడి నీటి కాపడంకావలసినవినీరు – 200 mlనీరు కాయటానికి ఒక పాత్రకాటన్ బాల్
పద్దతి* ఒక పాత్రలో నీటిని తీసుకోని వేడి చేయాలి* నీరు వేడెక్కాక పొయ్యి మీద నుంచి దించి కొంచెం వేడి చల్లారనివ్వాలి* ఆ తర్వాత నీటిలో కాటన్ బాల్ ని ముంచాలి* ఆ కాటన్ బాల్ లో ఉన్న అదనపు నీటిని పిండి ప్రభావిత ప్రాంతంలో పెట్టాలి* ఈ విధంగా ప్రతి రోజు చేయాలి.
ఎలా పనిచేస్తుంది?ఈ పరిస్థితిలో చర్మ రంద్రాలు మూసుకొని ఉంటాయి.వేడి నీటి కాపడం పెట్టటం వలన చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి.
గాయాలు ఓపెన్ గా ఉంటే త్వరగా నయం అవుతాయి.ప్రభావిత ప్రాంతంలో వేడి నీటిని కాపడం పెట్టటం వలన బ్యాక్టీరియా లేకుండా శుభ్రం చేస్తుంది.అందువలన చర్మం మృదువుగా మారి నొప్పి తగ్గుతుంది.
2.ఆస్పిరిన్కావలసినవిఆస్పిరిన్ – 2 స్పూన్స్గోరువెచ్చని నీరు – 1 స్పూన్ఒక స్పూన్కాటన్ బాల్
పద్దతి* ఒక కంటైనర్ లో ఆస్పిరిన్, గోరువెచ్చని నీటిని వేసి కొంచెం సేపు కదపకుండా ఉంచాలి* ఒక స్పూన్ సాయంతో బాగా కలిపి పేస్ట్ చేయాలి* ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి 15 నిముషాలు అయిన తర్వాతగోరువెచ్చని నీటితో కడిగి, కాటన్ బాల్ సాయంతో శుభ్రం చేయాలి* ఈ విధంగా ప్రతి రోజు రెండు సార్లు చేయాలి.
ఎలా పనిచేస్తుంది?అస్పిరిన్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణలు ప్రబావిత ప్రాంతంలో వాపు మరియు ఎరుపుదనంను తగ్గించటంలో సహాయపడతాయి.అలాగే అస్పిరిన్ వాడకం వలన తొందరగా ఉపశమనం కలుగుతుంది.గోరు వెచ్చని నీరు, ఆస్ప్రిన్ రెండు కలిసి తొందరగా నయం కావటానికి సహాయపడతాయి.