నెల‌స‌రి స‌మ‌యంలో మొటిమలు వస్తున్నాయా..?అయితే ఈ టిప్స్ మీకే!

సాధార‌ణంగా చాలా మంది మ‌హిళ‌లు నెల‌స‌రి స‌మ‌యంలో మొటిమ‌ల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటుంటారు.ఆ సమయంలో టెస్టోస్టెరాన్, ఈస్టోజెన్ అనే రెండు ముఖ్యమైన హార్మోన్ల‌లో మార్పులు ఏర్ప‌డుతుంటాయి.

 How To Get Rid Of Pimples During Periods! Pimples During Periods, Pimples, Women-TeluguStop.com

అందువ‌ల్లే మొటిమ‌లు ఏర్ప‌డ‌తాయి.ఈ మొటిమ‌లు తీవ్ర నొప్పిని క‌లిగించ‌డంతో పాటు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కూడా పాడు చేస్తాయి.

అందుకే వీటిని త‌గ్గించుకునేందుకు ర‌క‌ర‌కాల క్రీములు వాడుతుంటారు.అయితే మెన్సస్ టైమ్‌లో ఇబ్బంది పెట్టే మొటిమ‌ల‌ను కొన్ని కొన్ని న్యాచుర‌ల్ టిప్స్ ద్వారా కూడా నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా చూసేయండి.

కొత్తిమీర మ‌రియు పుదీనా ఆకుల‌ను మెత్త‌గా నూరి ర‌సం తీసుకోవాలి.

ఈ ర‌సంలో కొద్దిగా ఉప్పు వేసి బాగా క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

ప‌ది నుంచి ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేయాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే మొటిమ‌లు మ‌టుమాయం అవ్వ‌డంతో పాటు ముఖం కాంతివంతంగా మారుతుంది.

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి మ‌రియు తేనె వేస మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు ఉన్న చోటు అప్లై చేసి.డ్రై అయిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేసినా కూడా నెల‌స‌రి స‌మ‌యంలో ఇరిటేట్ చేసే మొటిమలు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

Telugu Tips, Face Care, Face, Latest, Pimples, Pimples Periods, Skin Care Tips-T

ఇక మొటిమ‌ల‌ను త‌గ్గించుకోవాలంటే ఈ టిప్స్‌తో పాటుగా నెల స‌రి స‌మ‌యంలో మ‌రి కొన్ని జాగ్ర‌త్త‌లు కూడా పాటించాలి.ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ ను తినడం నివారించాలి.వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.

ముఖానికి ఖ‌చ్చితంగా మాయిశ్చ‌రైజ‌ర్ అప్లై చేసుకోవాలి.మేకప్ ప్రొడక్ట్స్ ను దూరంగా ఉండాలి.

మ‌రియు డైట్‌లో తాజా పండ్లు, కూర‌గాయ‌లు ఉండేలా చూసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube