నవగ్రహ దోషాలతో బాధపడుతున్నారా.. అయితే ఈ పరిహారాలు తప్పనిసరి..!

మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం చాలా మంది ఎన్నో ఆచార వ్యవహారాలను నమ్ముతారు.ఈ క్రమంలోనే మన ఇంట్లో పిల్లలు జన్మించగానే వారికి జాతకాన్ని చూయించడం వారి జాతకంలో ఏవైనా గ్రహదోషాలు ఉన్నాయో అని జ్యోతిషశాస్త్రాన్ని సంప్రదిస్తాము.

 How To Get Rid Of Navagraha Dosham And Some Solutions Details,  Navagraha Stotra-TeluguStop.com

ఇలా మన జాతకంలో ఏవైనా గ్రహదోషాలు ఉంటే అనుకున్న పనులు సరిగా నెరవేరకపోవడం, ఎన్నో సమస్యలు చుట్టుముట్టడం, అనారోగ్య సమస్యలు వంటివి తలెత్తుతుంటాయి.అయితే ఇలా జాతకంలో గ్రహదోషాలు ఉన్న వారు వాటికి సరైన పరిహారాలు చేయటం వల్ల జాతక దోషాలు నుంచి విముక్తి పొందవచ్చు.

మరి గ్రహదోష ఉన్నవారు ఏ విధమైనటువంటి పరిహారాలు చేయటం వల్ల ఈ విధమైనటువంటి దోషం నుంచి విముక్తి పొందవచ్చునో ఇక్కడ తెలుసుకుందాం.

నవగ్రహ దోషాలతో బాధపడేవారు నవగ్రహ దోషం నుంచి విముక్తి పొందాలంటే శనివారం అన్నదానం చేయటం వల్ల దోష పరిహారాలు తొలగిపోయి మన జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు.

మన జీవితంలో శని గ్రహ దోషం ఉన్నట్లయితే నీలం ఆకుపచ్చ దుస్తులకు దూరంగా ఉండడం వల్ల దోష పరిహారం జరుగుతుంది.అలాగే నుదిటిపై పసుపు పెట్టడం వల్ల వారికి గురు బలం పెరుగుతుంది.

పదిహేను రోజులపాటు ఆవుపాలను ఏదైనా గుడిలో స్వామివారి అభిషేకానికి ఇవ్వడంతో ఇలాంటి నవగ్రహ దోషాలు నుంచి విముక్తి పొందవచ్చు.

ఇక చంద్ర దోషం తొలగిపోవాలంటే గుప్పెడు బియ్యాన్ని పారుతున్న నదిలో లేదా కాలువలో వేయటం వల్ల చంద్రుడి దోషాలు తొలిగిపోయి చంద్ర బలం పెరుగుతుంది.అలాగే గురువారం ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండడం చేత గురు గ్రహ దోష పరిహారం జరుగుతుంది.కేతు గ్రహ దోషాలు తొలగిపోవాలంటే 16 రోజుల పాటు ఏదైనా ఆలయంలోని స్వామివారికి దానధర్మాలను చేయాలి.

శుక్రుడి అనుగ్రహం పొంది శుక్ర గ్రహ దోషం తొలగిపోవాలంటే బయటకు వెళ్ళే సమయంలో మన పర్సులో వెండి నాణెం ఎంతో మంచిదని ఇలా చేయడం వల్ల శుక్ర గ్రహ దోష ప్రభావం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube