చలికాలం పొడిచర్మం ఇబ్బందా ? ఈ సలహాలు చూడండి  

How To Get Rid Of Dry Skin In This Winter-

చలికాలం, పొడిచర్మం, రెండు ఒకేసారి వస్తాయి.వెళ్ళేటప్పుడు కూడా కలిసే వెళతాయి.చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా.పొడిబారిపోయి, అతిగా పౌడర్ రాసేసుకున్నట్టుగా ఉండే చర్మం, ఒక్కోసారి దురదగా కూడా అనిపిస్తూ ఉంటుంది.

ఈ పొడిచర్మంతో ఇబ్బందిపడేకన్నా .మేం చెప్పే సూచనలపై కొంచెం కష్టపడండి

-

* కొబ్బరినూనెలో ఫాట్టి ఆసిడ్స్ ఎక్కువ ఉంటాయి.

రాత్రి పడుకునే ముందు చర్మానికి కొబ్బరినూనె పట్టి, ఉదయం లేవగానే కదిగేసుకోండి.పొడిబారిన చర్మం కోమలంగా మారుతుంది

* యొగ్ రట్ లో మాయిశ్చరైజర్ ఎలిమెంట్స్ బాగా ఉంటాయి.

స్నానానికి ఓ పది నిమిషాల ముందు దీన్ని ఒంటికి రాసుకొని స్నానం చేయండి

* పాలలో ఉండే లాక్టిక్ ఆసిడ్ మృతకాణాలపై పనిచేస్తుంది.ఇందులో యాంటి ఇంఫ్లేమెంటరి ప్రాపర్టిస్ కూడా ఎక్కువే.కాబట్టి గుడ్డ లేదా కాటన్ ని చలిపాలలో ముంచి, చర్మంపై మెల్లిగా రుద్దండి.ఓ పది పదిహేను నిమిషాలు ఉంచి ఆ తరువాత కడిగేసుకోండి.

రోజూ ఇలానే చేయండి.

* ఆలీవ్ ఆయిల్ లో ఫాట్టి ఆసిడ్స్ తో పాటు యాంటిఆక్సిడెంట్స్ లభిస్తాయి.

అందుకే ఇది చర్మ ఆరోగ్యానికి మందు లాంటిది.స్నానానికి ఓ అరగంట ముందు చర్మానికి ఆలివ్ ఆయిల్ పట్టి ఆ తరువాత స్నానం చేయండి

* రోజు స్నానానికి పదిహేను నిమిషాల ముందు చర్మానికి తేనే రాసుకోండి.

ఇది కేవలం పొడిచర్మం కోసమే కాదు, చర్మాన్ని కాంతివంతంగా, నునుపుగా చేయడానికి ఉపయోగపడుతుంది.అయితే, సాద్యమైనంతవరకు ఆర్గానిక్ తేనే వాడటానికి ప్రయత్నించండి.

.

తాజా వార్తలు

How To Get Rid Of Dry Skin In This Winter- Related....