చుండ్రు సమస్యలకు చెక్ పెట్టేద్దామా?  

 • ముఖ్యంగా ఈ కాలంలో చుండ్రు సమస్య అధికంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తెల్లని పొట్టు మాదిరిగా రాలి పోతూ ఉంటుంది. ఈ సమస్యను ఆలా వదిలేయకుండా మనకు ఇంటిలో సులభంగా దొరికే వస్తువులతో సులభంగా ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

 • వెనిగర్

  మూడు కప్పుల నీటిలో ఒక కప్పు వేడినీరు కలపాలి . తల మీద మెల్లగా మసాజ్ చేస్తూ ఆ నీటిని పోయాలి. 15 నిమిషాల తర్వాత తలస్నానము చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు సమస్య తొందరగా తగ్గిపోతుంది.

 • ఆముదం

  దీనిలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన రకరకాల ఇన్ ఫెక్షన్స్ ని దూరంలో చేయటంలో సహాయపడుతుంది. రక్తప్రసరణ మెరుగు అవుతుంది. తలకు ఆముదంతో మసాజ్ చేసి ఒక గంట తర్వాత తలస్నానము చేయాలి.

 • పెరుగు,నిమ్మకాయ

  ఒక నిమ్మకాయ రసాన్ని ఒక కప్పులోకి తీసుకోని దానిలో ఒక కప్పు పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు ప్యాక్ వేయాలి. ఒక గంట అయ్యాక తేలికపాటి షాంపూ తో తలస్నానము చేయాలి.

 • వేప

  ఈ ఆకుల్లో యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఒక బకెట్ నీటిలో ఐదు గుప్పెళ్ళ వేప ఆకులను వేసి, అరగంట అయ్యాక నీటిని వడగట్టి తలస్నానానికి ఉపయోగించాలి.