పచ్చిమిర్చి కోసినప్పుడు చేతుల మంట తగ్గాలంటే... బెస్ట్ చిట్కా....ఇలాంటి మరెన్నో వంటింటి చిట్కాలు  

 • పచ్చిమిర్చి కోసినప్పుడు చేతులు మండటం సహజమే. పంచదార కలిపిన నీటితో చేతులను కడిగితే చేతుల మంట తగ్గిపోతుంది.

 • అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యం లేదా సెనగపప్పు వేస్తే మెత్త బడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

 • బాగా పండిన అరటిపండును మెత్తగా పిసికి చపాతీ పిండిలో కలిపితే చపాతీలు మృదువుగా వస్తాయి.

 • పువ్వులను టమోటాలు,అరటిపండ్లు ఉండే చోట అసలు పెట్టకూడదు. ఎందుకంటే ఆ పండ్ల నుండి నుంచి వచ్చే ఇథలిన్ వాయువు కారణంగా పువ్వులు తొందరగా వాడిపోతాయి.

 • కరివేపాకుని ఎండపెట్టి పొడి చేసి సీసాలో భద్రపరచుకొని ప్రతి రోజు కూరల్లో వేసుకుంటూ ఉంటే కూరకు మంచి రుచి రావటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.


 • ఆమ్లెట్ కి అదనపు రుచి రావాలంటే సొనలో కొంచెం కొబ్బరి వేయాలి.

 • స్నాక్స్ తయారుచేసినప్పుడు కారానికి బదులు మిరియాల పొడి వేస్తె మంచి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.

 • పచ్చి బఠాణీలు ఉడికించేటప్పుడు చిటికెడు పంచదార వేస్తె రంగు మారకుండా ఉంటాయి.

 • నెయ్యి మంచి వాసన వచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వెన్న కాచేటప్పుడు తమలపాకు వేయాలి.

 • అరటి,బంగాళా దుంప ముక్కలను ఉప్పు కలిపిన నీటిలో పది నిముషాలు ఉంచి ఆ తర్వాత వేగిస్తే ముక్కలు బాగా వేగుతాయి.

 • పచ్చిమిర్చికి గాట్లు పెడితే నూనెలో వేగించినప్పుడు పేలకుండా ఉంటాయి.

 • ఉల్లిపాయ గోల్డ్ కలర్ లో వేగాలంటే… చిటికెడు పంచదార వేయాలి.