ఇంట్లో చీమ‌లు ఇరిటేట్ చేస్తున్నాయా..?అయితే ఈ టిప్స్ మీకే!

చీమ‌లు ఎంత‌గా ఇరిటేట్ చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ఏదైనా ఆహారం కింద ప‌డితే చాలు.

 How To Get Rid Of Ants From House! Ants, House, Ants From House, Latest News, Li-TeluguStop.com

తండోప తండాలుగా చీమలు వ‌స్తూనే ఉంటాయి. స్వీటు, హాట్లు అని తేడా లేకుండా.

అన్నింటిపైనా ఈ చీమ‌లు దండెత్తేస్తాయి.అలాగే గడపలు, గోడలు ఇలా ప్రతి దాన్లోనూ కన్నాలు పెట్టి నాశ‌నం చేస్తాయి.

అయితే ఈ చీమ‌ల బెడ‌ద త‌ట్టుకోలేక‌.కొంద‌రు మందులు వేసి వాటిని చంపేస్తారు.

కానీ, మన పర్యావరణాన్ని కాపాడ‌టంలో చీమ‌లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అందుకే వాటిని చంప‌డం క‌న్నా ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు త‌రిమి కొట్ట‌డ‌మే మేలు.

మ‌రి అందుకోసం ఏం చేయాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

మాన‌వులు మెచ్చే దాల్చిన చెక్క వాసన చీమ‌ల‌కు గిట్ట‌నే గిట్ట‌దు.

అందుకే చీమలు వచ్చే కన్నాల దగ్గర దాల్చిన చెక్క పొడి జిమ్మితే అవి పరార్ అవుతాయి.వాట‌ర్‌లో దాల్చిన చెక్క పొడి క‌లిపి ఆ నీటిని పోసినా చీమ‌లు వెళ్లిపోతాయి.

నిమ్మ ర‌సం కూడా చీమ‌ల బెడ‌ద‌ను త‌గ్గించుకోవ‌చ్చు.నిమ్మ ర‌సాన్ని చీమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జ‌ల్లితే వెంట‌నే అవి వేరే దారి చూసుకుంటాయి.

Telugu Baby Powder, Coffee Powder, Latest, Lemon, Lifestyle, Vinegar-Telugu Heal

అలాగే కాఫీ పొడి వాస‌న‌కు కూడా చీమ‌లు అస్స‌లు ప‌డ‌దు.కాఫీ పొడిని చీమలు ఉన్న చోట చల్లితే.అవి దరిదాపుల్లో కూడా కనిపించవు.కిటికీలు, తలుపుల మూలల్లో కూడా కాఫీ పొడి వేస్తే.చీమలతో పాటు ఇతర పురుగులు కూడా రాకుండా ఉంటాయి.

తీపి ఆహారాలు పెట్టిన డ‌బ్బాల చుట్టు చీమ‌లు ఎక్కిస్తూ ఉంటాయి.

అలా ఎక్క‌డ‌కుండా ఉండాలీ అంటే డ‌బ్బా చుట్టూ బేబీ పౌడ‌ర్ జ‌ల్లాలి.ద్వారా చీమ‌లు ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటాయి.చీమలను నివారించడానికి బేబీ పౌడ‌ర్‌ ఒక సురక్షితమైన మార్గం.

ఇక వెనిగర్‌తో కూడా చీమ‌ల‌ను త‌రిమి కొట్ట‌వ‌చ్చు.నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి… ఆ నీటిని చీమలు ఎక్కువ‌గా ఉన్న చోటు స్ప్రై చేయాలి.ఇలా చేస్తే వెంట‌నే చీమ‌లు పారిపోతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube