చీమలు నిమిషంలో పారిపోయే చిట్కా

వంటగదిలో అనేక రకాల పదార్ధాలు ఉంటాయి.వాటిని మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకున్న సరే చీమలకు మాత్రం కన్పించేస్తూ ఉంటాయి.

 How To Get Rid Of Ant At Home-TeluguStop.com

ఆ పదార్ధాలకు చీమలు ఇట్టే పెట్టేస్తూ ఉంటాయి.చీమలు వంటగదిలోకి వచ్చాయంటే ఒక పట్టాన వదలవు.

చీమలను వదిలించుకోవడానికి ఎన్నో చిట్కాలను పాటిస్తాం.కానీ ఏమి వర్క్ అవుట్ కావు.

ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను ఉపయోగిస్తే చీమలు సులువుగా పారిపోతాయి.

చీమలను తరికొట్టటానికి నిమ్మరసం బాగా సహాయపడుతుంది.

నిమ్మరసంలో ఉప్పు కలిపి స్ప్రై బాటిల్ లో పోసి చీమలు ఉన్న ప్రదేశంలో స్ప్రై చేస్తే ఉదయానికి చీమలు పారిపోతాయి.

చీమలను వదిలించుకోవడానికి దాల్చినచెక్క పొడి మంచి రెమిడీ.

రాత్రి పడుకొనే ముందు చీమలు ఉన్న ప్రదేశంలో కొంచెం దాల్చిన చెక్క పొడిని జల్లితే ఉదయానికి చీమలు మాయం అయ్యిపోతాయి.దాల్చిన చెక్కతో ఉండే ఘాటును చీమలు భరించలేవు.

చీమలను తరిమికొట్టడానికి మరొక రెమెడీ మిరియాల పొడి.ఒక కప్పు వేడినీటిలో ఒక స్పూన్ మిరియాల పొడిని కలిపి స్ప్రై బాటిల్ సాయంతో చీమలు ఉన్న ప్రదేశంలో స్ప్రై చేస్తే చీమలు పారిపోతాయి.


ఒక గిన్నెలో నీటిని మరిగించి దానిలో ఉప్పు,కారం వేసి ఆ నీటిని చీమలు ఉన్న ప్రదేశంలో జల్లితే చీమలు క్షణాల్లో మాయం అవుతాయి.

వెనిగర్ చీమలను నివారించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

బ్లాక్ వెనిగర్ ని స్ప్రై బాటిల్ లో పోసి చీమలు ఉన్న ప్రదేశంలో స్ప్రై చేస్తే వెనిగర్ వాసనకు చీమలు బయటకు వెళ్లిపోతాయి.

కొన్ని వెల్లుల్లి రెబ్బలను నలిపి చీమలు ఉన్న ప్రదేశంలో పెడితే చీమలు మాయం అవుతాయి.

కొన్ని పుదీనా ఆకులను నలిపి చీమలు ఉన్న ప్రదేశంలో పెడితే ఆ ఘాటుకు చీమలు పారిపోతాయి.

చూసారుగా ఫ్రెండ్స్ ఈ చిట్కాలను ఉపయోగించి మీ వంటగది నుండి చీమలను తరిమేసి హ్యాపీగా ఉండండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube