మందు ఎక్కువై తలనొప్పి వేస్తే ఏం చేయాలి ?  

How To Get Over With Hang Over Quickly ?-

ఓ మంచి బ్రాండు తాగుతున్నారు అనుకోండి, ఆరోజు మందుబాబుల హడావుడి మాములుగా ఉండదు.ఇక మళ్ళీ ఈ బ్రాండ్ ఎప్పుడు దొరుకుతుందో అనే కక్కుర్తితో ఎక్కువ తాగేస్తారు.ఫలితం ? తెల్లారి తలనొప్పి..

How To Get Over With Hang Over Quickly ?---

దాన్ని ముద్దుగా హ్యాంగోవర్ అంటారు.కొంతమంది మరీ టూ మచ్ గా తాగకపోయినా తలనొప్పి వేస్తుంది.కొందరి బాడి టైప్ అంతే.

మామూలు తలనొప్పికి, ఈ తలనొప్పికి చాలా తేడా ఉంటుంది.రెండిటి లక్షణాలు కూడా వేరే ఉంటాయి.తలనొప్పితో పాటు, వాంతులు, అలసట, అలసట .

ఇలా పలు లక్షణాలు కనబడతాయి.మరి ఈ హ్యాంగోవర్ తలనొప్పిని వదిలించుకునేది ఎలా ? ఏం చేయాలి ?* మంచినీళ్ళు బాగా తాగండి :ఈ హ్యాంగోవర్ రావడం వెనుక చిన్న సైన్స్ ఉంది.మందు బాగా తాగితే ఏమవుతుంది ? మూత్రం మంచుకువస్తుంది.

దాంతో ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తారు.దాంతో శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది.అంటే నీటి శాతం పడిపోతుంది.

దాంతో తలనొప్పి పుడుతుంది.అందుకే, తెల్లారి లేవగానే ముందుగా మంచినీళ్ళు తాగాలి.చెప్పాలంటే, రాత్రి మద్యం తాగినా, తాగకపోయినా, లేవగానే నీళ్ళు తాగాలి.

* కొబ్బరినీళ్ళు తాగండి :రక్తంలో ఉండే అయిదు ఎలక్ట్రోలైట్స్ కొబ్బరినీళ్ళలో ఉంటాయి.కాబట్టి కొబ్బరినీళ్ళు చాలా త్వరగా మన శరీరాన్ని పూర్వస్థితిలోకి తీసుకువెళ్తాయి.అంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ని వెంటనే రీస్టోర్ చేస్తాయి కొబ్బరినీళ్ళు.ఇందులో పొటాషియం పాళ్ళు కూడా ఎక్కువ.

అలాగే డిహైడ్రెషన్ సమస్య కూడా దూరమైపోతుంది.* మంచి బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి :ఉదయాన్నే ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం అవసరం.ఇక హ్యాంగోవర్ ఉన్నప్పుడు అయితే ఇది అత్యవసరం.సలాడ్స్ తీసుకోండి.

గుడ్లు తినండి.ఇప్పుడు మినరల్స్ అండ్ ప్రోటీన్స్ అవసరం కదా.అలాగే ఎమినో ఆసిడ్స్ ఎక్కువ ఉండే ఆహారాలపై దృష్టి పెట్టండి.

* అల్లం పనిచేస్తుంది :* అల్లం తలనొప్పిని తగ్గిస్తుంది.బ్లడ్ సర్కిలేషన్ పెంచి యాక్టివ్ గా చేస్తుంది.ఇది హ్యాంగోవర్ వలన వచ్చే వాంతి సెన్సేషన్ ని కూడా తగ్గిస్తుంది.అల్లం మాత్రమే కాకుండా, అల్లంతో పాటు పెప్పర్మేంట్ కలిపి తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.

మిగితా చిట్కాలు :– నిమ్మరసం తాగండి.టాక్సిన్స్ ని బయటకు తీసి రిలీఫ్ ని ఇస్తుంది.

– పెరుగు తీసుకోండి.ఆల్కహాల్ ఎఫెక్ట్ తగ్గుతుంది.

– హెర్బల్ టీ, అంటే గ్రీన్ టీ, లెమన్ టీ లాంటివి.పైన చెప్పిన అల్లంతో కూడా టీ తయారుచేసుకోవచ్చు.

– అల్లం,వెల్లుల్లి తో సూప్ తాయారుచేసుకొని తాగండి.