మీ క‌ళ్ళు ఆక‌ర్ష‌ణీయంగా మారాలా? అయితే ఈ టిప్స్ ట్రై చేయాల్సిందే!

క‌ళ్ళు ఆక‌ర్షణీయంగా ఉంటే అందం పెర‌గ‌డ‌మే కాదు, ఎవ్వ‌రైనా ఇట్టే ఎట్రాక్ట్ అవుతుంటారు.అంతేకాదు, కొంద‌రు క‌ళ్ళ‌ను చూసే ప్రేమ‌లో కూడా ప‌డుతుంటారు.

 How To Get Glowing Eyes In Naturally-TeluguStop.com

ఇక క‌ళ్ళ‌పై ఎన్ని క‌విత‌లు ఉన్నాయో, మ‌రెన్ని పాట‌లు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అంద‌రూ అంద‌రూ త‌మ క‌ళ్ళు ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాల‌ని కోరుకుంటారు.

కానీ, నేటి ఆధునిక కాలంలో చాలా మంది క‌ళ్ళు క‌ళ‌ త‌ప్పి ఉంటున్నాయి.ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం, కాలుష్యం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే మేక‌ప్ ప్రోడెక్ట్స్ వాడ‌టం, నిద్ర‌లేమి ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల క‌ళ్ళు కాంతిహీనంగా మారుతున్నాయి.

 How To Get Glowing Eyes In Naturally-మీ క‌ళ్ళు ఆక‌ర్ష‌ణీయంగా మారాలా అయితే ఈ టిప్స్ ట్రై చేయాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆకర్షణీయంగా మ‌రియు మనోహరంగా కళ్ళు ఉండాలంటే ఖ‌చ్చితంగా కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా క‌ళ్ళ వ‌ద్ద ముడ‌త‌లు ఏర్ప‌డుతుంటాయి.వీటి వ‌ల్ల క‌ళ్ళ అంద‌హీనంగా క‌నిపిస్తాయి.

అయితే పాల మీగ‌డ తీసుకుని క‌ళ్ళ‌పై మ‌రియు చుట్టూ అప్లై చేసుకుని వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా రుద్దుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు రాత్రి నిద్రించే ముందు చేసి ఉద‌యాన్నే చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకుంటే క‌ళ్ళు అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా మార‌తాయి.

ఉప్పును క‌ళ్ళ‌ను మెరిపించుకోవ‌చ్చు.కొద్దిగా వాట‌ర్ తీసుకుని అందులో స‌ముద్ర‌పు ఉప్పు వేసి క‌రిగించాలి.ఇప్పుడు ఈ ఉప్పు నీటితో కాళ్ళ‌ను శుభ్రం చేసుకోవాలి.ఇలా చేస్తే క‌ళ్ళు ప్ర‌కాశ‌వంతంగా మార‌తాయి.

న‌ల్ల‌టి వ‌ల‌యాల వ‌ల్ల కూడా క‌ళ్ళ కాంతి త‌గ్గుతుంది.అయితే ట‌మాటా ర‌సం తీసుకుని అందులో నిమ్మ ర‌సం యాడ్ మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ళ చుట్టూ అప్లై చేసి ఇర‌వై నిమిషాల అనంత‌రం క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే వ‌ల‌యాలు త‌గ్గి.క‌ళ్ళు కాంతివంతంగా మార‌తాయి.

ఇక ఈ టిప్స్‌తో పాటు వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.

తాజా పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు తీసుకోవాలి.ఆయిల్ ఫుడ్స్‌, ఫాస్ట్ ఫుడ్స్ త‌గ్గించాలి.

ప్ర‌తి రోజు ఎనిమిది నుంచి తొమ్మిది గంట‌లు నిద్రించాలి.అప్పుడే కాళ్ళు ఆక‌ర్ష‌ణీయంగా మార‌తాయి.

#Beauty Tips #Natural Tips #Beauty #Eyes #Health Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు