నీటిలో ఇవి క‌లిపి స్నానం చేస్తే..స్కిన్ మృదువుగా మెరిసిపోతుంద‌ట‌!

ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో హెల్త్ విష‌యంలోనే కాదు.

 How To Get Glow And Soft Skin In Rainy Season! Glow And Soft Skin, Rainy Season,-TeluguStop.com

స్కిన్ విష‌యంలో కూడా ఎన్నో జాగ్ర‌త్త‌లు పాటించాలి.ఎందుకంటే, ఈ సీజ‌న్‌లో స్కిన్ డ్రై అయిపోవ‌డం, ప‌గుళ్లు, మొటిమ‌లు, ర్యాషెస్ ఇలా ఎన్నో చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతుంటారు.

వీటిని నివారించుకుని చ‌ర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మెరిపించుకోవాలీ అంటే ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.ఆ టిప్స్ ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసు కుందాం.

సాధార‌ణంగా వ‌ర్షాకాలమంటే అంద‌రూ స్నానానికి వేడి నీటినే ఎంచు కుంటారు.అయితే ఆ వేడి నీటిలో కొద్దిగా స‌ముద్ర ఉప్పు వేసి క‌రిగించి.ఆ త‌ర్వాత స్నానం చేయాలి.ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల శ‌రీరంపై పేరుకుపోయిన మురికి, మ‌లినాలు, డెడ్ స్కిన్ సెల్స్‌ పోయి చ‌ర్మం కాంతి వ‌తంగా మారుతుంది.

అలాగే ఉప్పు క‌లిపిన నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు దూరం అవుతాయి.ఆల‌స‌ట దూరమై.

శ‌రీరం రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లి పోతుంది.

Telugu Tips, Glow Soft Skin, Skin, Latest, Rainy Season, Skin Care, Skin Care Ti

అలాగే గోరు వెచ్చ‌ని నీటిలో రోజ్ వాట‌ర్ మిక్స్ చేసి.ఆనంత‌రం ఆ నీటితో బాత్ చేయాలి.ఇలా చేస్తే మొటిమ‌లు, మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

అలాగే రోజ్ వాట‌ర్‌లో ఉండే పవర్‌ఫుల్ యాంటీ సెప్టిక్, యాంటీ ఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ ర్యాషెస్‌, దుర‌ద‌, మంట వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి.స్కిన్‌ను గ్లోగా మారుస్తాయి.

ఇక ప్ర‌తి రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా కొబ్బ‌రి నూనె క‌లిపి చేయాలి.ఇలా చేస్తే.

ముడ‌త‌లు త‌గ్గుతాయి.పొడి చ‌ర్మం దూరం అవుతుంది.

స్కిన్ మాయిశ్చ‌రైజ్‌గా ఉంటుంది.మ‌రియు చ‌ర్మం య‌వ్వ‌నంగా, మృదువుగా మెరిసి పోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube