పాలతో ఒకసారి ఇలా చేస్తే నల్లని ముఖం తెల్లగా మారుతుంది...చూస్తే ఆశ్చర్యపోతారు  

  • పాలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. పాలలో రిబో ఫ్లోవిన్,థైమాన్, విటమిన్ బి 6,విటమిన్ బి12,విటమిన్ సి, విటమిన్ ఏ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యంతో పాటు అందాన్ని మెరుగుపరచడంలో కూడా బాగా సహాయపడతాయి. పాలలో సమృద్ధిగా ఉండే లాక్టిక్ ఆమ్లాలు చర్మంపై పేరుకున్న దుమ్ము,ధూళి,నలుపుదనంను తగ్గించి చర్మం మృదువుగా,కాంతివంతంగా ఉండేలా చేస్తాయి.

  • ఈ రోజులో అడ,మగ అనే తేడా లేకుండా అందరూ బయటకు వెళ్లి పని చేస్తున్నారు. దాంతో చర్మంపై దుమ్ము,కాలుష్యం కారణంగా ముఖం నల్లగా మారిపోతుంది. ఇలా నల్లగా మారిన ముఖాన్ని తెల్లగా మార్చుకోవటానికి మార్కెట్ లో ఎన్నో రకాల క్రీమ్స్ ఉంటాయి. కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పే చిట్కా సహజసిద్ధమైన పదార్ధాలతో తయారుచేసింది. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

  • అయితే పాలను ఎలా ఉపయోగిస్తే ముఖం అందంగా,మృదువుగా,కోమలంగా మారుతుందో తెల్సుకుందాం. ఈ చిట్కాకు కావాల్సిన వస్తువులు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. అవి బియ్యం పిండి,మైదా పిండి,పాలు. బియ్యంపిండిలో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు,పోషకాలు ముఖం మీద ముడతలను తగ్గించటమే కాకుండా ముఖాన్ని తెల్లగా మారుస్తుంది. మైదాలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు చర్మాన్ని సహజంగా బ్లీచింగ్ చేసి నలుపును తొలగించి ముఖం తెల్లగా అయ్యేలా చేస్తుంది.

  • ఇప్పుడు ఈ పేస్ ప్యాక్ ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. ఒక బౌల్ లో రెండు స్పూన్ల బియ్యం పిండి, రెండు స్పూన్ల మైదా పిండిని తీసుకోని పాలతో పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసుకొని అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఒక వారం పాటు చేస్తే ముఖం మీద మలినాలు, ముడతలు, తాన్, నలుపు తొలగిపోయి కాంతివంతంగా,మృదువుగా మారుతుంది. ముఖం నల్లగా మారిందని బాధపడకుండా ఈ చిట్కాను వారం రోజులు పాటిస్తే ఆ మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు.