మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పగిలిందా? సులభంగా ఇలా రిపేర్ చేసుకోండి!

స్మార్ట్‌ఫోన్‌ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది.స్మార్ట్‌ఫోన్ లేకుండా కొన్ని గంటలు గడపడం కూడా కష్టంగా మారింది.

 How To Fix Your Phone Or Tablet Broken Screen   Phone , Broken Screen ,  Nail Po-TeluguStop.com

అలాంటి పరిస్థితిలో ఫోన్‌కు ఏదైనా జరిగితే ప్రాణాలు పోయినంత బాధపడేవారు కూడా ఉన్నారు.చాలా మంది తమ ఫోన్‌ను రోజంతా దగ్గరే ఉంచుకుంటారు.

వెళ్లిన ప్రతిచోటకు తమ ఫోన్‌ను తీసుకువెళుతుంటారు.ఒక్కోసారి ఫోన్ పడిపోతే దాని స్క్రీన్ పగిలిపోతుంటుంది.

అటువటప్పుడు కొత్త స్క్రీన్‌ వేయించడం చాలా ఖరీదైనదిగా మారుతుంది.స్క్రీన్ పగిలిన తర్వాత మొదట ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కొంటుంటే ఈ సలహా మీ కోసమే.ఇప్పుడు మనం స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను సరిచేయడానికి ఉన్న పరిష్కారం మార్గం గురించి తెలుసుకుందాం.

ఈ ఉపాయంతో మీరు ఇంట్లో కూర్చునే స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను రిపేర్ చేసుగోగలుగుతారు.ఆ వివరాలు ఇప్పడు తెలుసుకుందాం.

ఇందుకోసం నెయిల్ పాలిష్ అవసరమవుతుంది.ఇందుకోసం మీరు మొదట స్క్రీన్ పగుళ్లపై నెయిల్ పాలిష్ పూయాలి.

దానిని కాసేపు ఆరనివ్వండి.ఆపై పదునైన రేజర్ బ్లేడ్‌తో స్క్రాప్ చేయడం ద్వారా నెయిల్ పాలిష్‌ను తొలగించాలి.స్క్రీన్‌కు పగుళ్లు ఉన్నచోట మరోసారి మరోసారి నెయిల్ పాలిష్ పూయండి.తిరిగి దానిని స్క్రాప్ చేయండి.

అప్పుడు మీ ఫోన్ స్క్రీన్ చక్కగా మారినట్లు కనిపిస్తుంది.మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై పగుళ్లు ఉంటే, మీరు దానిని టూత్‌పేస్ట్‌తో కూడా పరిష్కరించుకోవచ్చు.

దానిని మీ ఫోన్ డిస్‌ప్లేపై ఉన్న క్రాక్‌పై అప్లై చేయవలసి ఉంటుంది.తరువాత దానిని కొద్దిగా రుద్దండి.

కొంత సమయం పాటు అలానే ఉంచండి.తరువాత మీరు కాటన్‌తో టూత్‌పేస్ట్‌ను శుభ్రం చేసినప్పుడు, మీ ఫోన్‌ స్క్రీన్ పై ఉండే పగుళ్లు మాయమవుతాయి.

ఈ ట్రిక్స్ యూ ట్యూబ్ నుంచి తీసుకున్నవి.ఇవి ఫోన్ స్క్రీన్‌ను పూర్తిగా సరిచేయవు.

అయితే ఈ ట్రిక్స్ మీ ఫోన్ స్క్రీన్‌ను రిపేర్ చేయించేంత వరకూ మీకు సహాయపడతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube