థైరాయిడ్ ను ఎలా గుర్తించాలి..?

థైరాయిడ్ ను ఎలా గుర్తించాలి.? ప్రస్తుతం మహిళలను బాగా వేధిస్తున్న సమస్యలో థైరాయిడ్ ఒకటి.సాధారణంగా థైరాయిడ్ అంటే ఒక హార్మోన్.ఇది ఎక్కువైనా తక్కువైనా సమస్యే.షుగర్, బీపీలు తర్వాత థైరాయిడ్ ఆ తర్వాత స్థానంలో ఉంది.అందుకే 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళ తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి.

 How To Find The Disease Thyroid Earlier, How To Find, The Disease ,thyroid, Earl-TeluguStop.com

కొంతమంది మహిళలు అయితే 30 ఏళ్ల వయసు రాకముందే థైరాయిడ్ బారిన పడుతుంటారు.చాలా మంది మహిళల్లో పెళ్లి కాకముందే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

చాలా మంది మహిళలకు సంతానయోగం కలగడం లేదు.తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరగడం ప్రధాన సమస్య.

థైరాయిడ్ ను ప్రారంభదశలోనే గుర్తించాలని వైద్యులు చెబుతున్నారు.ఈ లక్షణాలతో థైరాయిడ్ సమస్యను సులభంగా గుర్తించవచ్చు.ముఖ్యంగా బరువు తగ్గిపోవడం, నిద్రపోయినా అలసటగా ఉండటం, నెలసరి క్రమం తప్పడం, గర్భం దాల్చలేకపోవడం, భావోద్వేగాల్లో తీవ్రమైన మార్పులు,

Telugu Earlier, Weighty, Fall, Find, Thyroid-Telugu Health

డిప్రెషన్ లక్షణాలు, మెడ వాపుగా ఉండటం, గొంతు బొంగురు పోవడం, చర్మం పొడిబారడం గోళ్లు పెరగడం, జుట్టు రాలడం మలబద్ధకం, ఏకాగ్రత లోపం, జ్ఞాపకశక్తి తగ్గడం ఇవి కూడా థైరాయిడ్ లో భాగమే.అందుకే ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే వెంటనే సమస్యలను పరిష్కరించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube