మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందీ, లేనిదీ ఇలా వెరిఫై చేసుకోవ‌చ్చు తెలుసా..?   How To Find Out If Your Facebook Account Has Been Hacked Or Not     2018-10-25   07:56:29  IST  Raghu: Raghu

ఫేస్‌బుక్‌లో ఉన్న యూజ‌ర్ల స‌మాచారాన్ని త‌స్క‌రించి ఓ ప్రైవేట్ కంపెనీ అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసింద‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ఈ విష‌యం పెను దుమారాన్నే సృష్టించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా యూజ‌ర్లు ఫేస్‌బుక్‌పై దుమ్మెత్తి పోశారు. త‌మ‌కు తెలియ‌కుండా త‌మ స‌మాచారాన్ని చోరీ చేయ‌డ‌మే గాక‌, ప్రైవేటు కంపెనీల‌కు ఆ స‌మాచారాన్ని అప్ప‌గిస్తుంద‌ని చెప్పి ఫేస్‌బుక్‌ను విమ‌ర్శించారు. దీంతో ఆ సంస్థ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ యూజ‌ర్ల‌కు క్ష‌మాప‌ణ చెప్పారు. త‌న ఫేస్‌బుక్‌లో ప్ర‌త్యేక పోస్టులో ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే విష‌యం అంత‌టితో ముగియ‌లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఫేస్‌బుక్‌పై హ్యాక‌ర్ల దాడి ఎక్కువైంది. పెద్ద ఎత్తున యూజ‌ర్ల స‌మాచారం దొంగిలించ‌బ‌డింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌లే ఫేస్‌బుక్‌లోని 50 మిలియ‌న్ యూజ‌ర్ల స‌మాచారాన్ని హ్యాక‌ర్లు దొంగిలించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే హ్యాకింగ్ జ‌రిగిన మాట వాస్త‌వమేన‌ని, కానీ 29 మిలియ‌న్ల యూజ‌ర్ల అకౌంట్లలో ఉన్న స‌మాచారం మాత్ర‌మే చోరీకి గురైంద‌ని ఫేస్‌బుక్ అధికారికంగా తెలిపింది.

సెప్టెంబ‌ర్‌లో జ‌రిగిన సైబ‌ర్ దాడిలో మొత్తం 29 మిలియ‌న్ల ఫేస్‌బుక్ యూజ‌ర్ల అకౌంట్ల‌లో స‌మాచారం చోరీ అయిన‌ట్లు ఫేస్‌బుక్ నిర్దారించింది. ఈ క్ర‌మంలోనే యూజ‌ర్ల‌కు చెందిన ఫోన్ నంబ‌ర్లు, డివైస్ స‌మాచారం, వారి లింగం, వారికి ఇత‌ర యూజ‌ర్ల‌తో ఉన్న సంబంధాలు, వారు నివ‌సిస్తున్న ప్ర‌దేశం త‌దిత‌ర స‌మాచారాన్ని హ్యాక‌ర్లు చోరీ చేశారు. అయితే దీని ప‌ట్ల ఫేస్‌బుక్ త‌న యూజ‌ర్లంద‌రినీ హెచ్చ‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే స‌మాచారం చోరీకి గురైన ఫేస్‌బుక్ యూజ‌ర్ల అకౌంట్ల‌కు మెసేజ్‌ల‌ను పంపుతోంది.

How To Find Out If Your Facebook Account Has Been Hacked Or Not-

అయితే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోని స‌మాచారం కూడా చోరీకి గురైంద‌ని మీరు భావిస్తే.. దాన్ని ఎలా చెక్ చేసుకోవ‌డం అంటే.. అందుకు ఫేస్‌బుక్ ఒక వెబ్‌పేజీని అందుబాటులో ఉంచింది. మీరు ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయ్యాక ఆ వెబ్‌పేజీ ఓపెన్ చేస్తే అందులో ఒక మెసేజ్ క‌నిపిస్తుంది. ఒక వేళ మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్‌కు గురైతే ఫేస్‌బుక్ మీ అకౌంట్‌ను రీసెట్ చేసిన‌ట్లు అందులో క‌నిపిస్తుంది. ఒక వేళ మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్‌కు గురి కాన‌ట్ల‌యితే అందులో స‌మ‌స్య ఏమీ లేన‌ట్లుగా చూపిస్తుంది. అయితే ఆ మెసేజ్‌లో మీ అకౌంట్‌ను రీసెట్ చేసిన‌ట్లు చూపిస్తే మాత్రం.. మీరు జాగ్ర‌త్త ప‌డాల్సిందే. వెంట‌నే పాస్‌వ‌ర్డ్ ను, ఫోన్ నంబ‌ర్‌ను చేంజ్ చేయండి. దీంతో ఎక్కువ న‌ష్టం క‌ల‌గ‌కుండా ఉంటుంది. అయితే మీరు ఫేస్‌బుక్‌లో లాగిన్ అయ్యాక చూడాల్సిన ఆ వెబ్‌పేజీ ఇదే… https://www.facebook.com/help/securitynotice?ref=sec ఈ సైట్‌ను ఓపెన్ చేస్తే అందులో మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్‌కు గురైందీ, లేనిదీ ఇట్టే తెలిసిపోతుంది. క‌నుక వెంట‌నే ఆ విష‌యాన్ని క్లారిఫై చేసుకోవాలంటే ఈ వెబ్‌పేజీని ఓపెన్ చేయండి మ‌రి..!