భార్యతో హోటల్‌లో దిగిన వ్యక్తి... ఆ రూంలో సీసీ కెమెరా ఉందని ఎలా కనిపెట్టాడో తెలిస్తే నోరు వెళ్లబెడతారు  

How To Find Cc Camera In Hotel Room-cc Camera In Hotel Room,telugu Viral News,trolls On Airbnd,viral In Socia Media

కొన్ని రోజుల క్రితం దక్షిణ కొరియాలో ఒక హోటల్‌ రూంలో సీసీ కెమెరాలు పెట్టి దాదాపు 800 మంది జంటల శృంగారంకు సంబంధించిన వీడియోలను రికార్డు చేయడం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనంకు తెర తీసిన విషయం తెల్సిందే. ఆ విషయం మరవక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈసారి న్యూజిలాండ్‌లో సంఘటన జరిగింది. న్యూజిలాండ్‌లోని ఒక హోటల్‌ రూంలో హిడెన్‌ కెమెరా ఉంది...

భార్యతో హోటల్‌లో దిగిన వ్యక్తి... ఆ రూంలో సీసీ కెమెరా ఉందని ఎలా కనిపెట్టాడో తెలిస్తే నోరు వెళ్లబెడతారు-How To Find Cc Camera In Hotel Room

అక్కడ బస చేసిన వారందరికి కూడా ఆ కెమెరా స్వాగతం పలికి, ఆ రూం రహస్యాలు లైవ్‌గా బయటకు పంపిస్తూ ఉంది.

తాజాగా ఒక జంట ఎయిర్‌ బీఎన్‌బీ అనే యాప్‌ ద్వారా ఆ హోటల్‌లో రూం బుక్‌ చేసుకోవడం జరిగింది. పిల్లలు మరియు భార్య భర్తలు ఇద్దరు కూడా రూంలోకి వెళ్లారు. కొద్ది సమయం సేద తీరిన తర్వాత భర్త వైఫై సిగ్నల్‌ కోసం ప్రయత్నించాడు.

అయితే సీసీ కెమెరాకు సంబంధించిన సిగ్నల్‌ అతడికి చిక్కింది. ఇక్కడ సీసీ సిగ్నల్‌ వస్తుంది ఏంటా అని అతడు పరిశీలించాడు. వృతి రీత్యా సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు అయిన ఆ భర్త తనకున్న పరిజ్ఞానంతో ఆ హోటల్‌ గదిలో ఉన్న సీసీ కెమెరాను కనిపెట్టాడు..

సీలింగ్‌కు పైన ఉన్న ఒక చిన్న హోల్‌లో సీసీ కెమెరా ఫిక్స్‌ చేసి, బయట లైవ్‌ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. దాంతో అవాక్కయిన ఆ వ్యక్తి కుటుంబంతో సహా బయటకు వచ్చి హోటల్‌ మేనేజర్‌తో గొడవ పడటంతో పాటు, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ వివాదంను తనకు హోటల్‌ బుక్‌ చేసిన యాప్‌కు కూడా తెలియజేశాడు. యాప్‌ నిర్వహకులు వెంటనే ఆ హోటల్‌ను తమ జాబితా నుండి తొలగించడంతో పాటు, వెంటనే ఆ హోటల్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది.

అతడు సీసీ కెమెరా ఉందని కనిపెట్టడంతో ఇప్పుడు ఆ హోటల్‌ మూసి వేసే పరిస్థితి వచ్చింది. చిల్లర కోసం కక్కుర్తి పడి కోట్ల బిజినెస్‌ను నాశనం చేసుకోవడం అంటే ఇదే. మీరు ఏదైనా హోటల్‌కు వెళ్లినప్పుడు కాస్త జాగ్రత్తగా చుట్టుపక్కల చూసుకోండి...