మొబైల్ త్వరగా ఛార్జ్ అవాలంటే ఏం చేయాలి ?

మొబైల్ ఫుల్ ఛార్జ్ చేయడం ఓపికతో కూడుకున్న పనే.చాలావరకు మొబైల్స్ బ్యాటరి ఫుల్ అవడానికి గంటనుంచి రెండు గంటల సమయం తీసుకుంటాయి.

 How To Fasten Your Mobile Charging ?-TeluguStop.com

అదృష్టం బాగా లేకపోతే, అంతకన్నా ఎక్కువ సమయం తీసుకునే మొబైల్స్ లేకపోలేదు.ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అంటారు ? మొబైల్ ఫోన్ త్వరగా ఛార్జ్ ఎలా చేయాలి ? ఎంతసేపట్లో బ్యాటరి ఫుల్ అయేది మీ మొబైల్ ని బట్టే ఉంటుంది.దాన్నీ మార్చలేం.కాని కొంచెం వేగవంతం చేయవచ్చు.కొంచెం కాదు, చాలా వేగవంతం చేయవచ్చు.ఎలా ?

* వైఫై ఆన్ లోనే ఉంటుంది.నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి.కాని మనకు మాత్రం త్వరగా చార్జింగ్ పూర్తవాలి.ఎలా అవుతుందండి.మొదటి వైఫై ఆఫ్ చేయండి.

ఎయిర్ ప్లేన్ మోడ్ లో పెట్టేయండి ఫోన్ ని.

* యాప్స్ రన్నింగ్ లో ఉంచి మీరు చార్జింగ్ పెడితే ఏం లాభం.ఆ యాప్స్ పవర్ తీసుకుంటూ మీ చార్జింగ్ ప్రాసెస్ ని స్లో చేస్తున్నాయిగా.కాబట్టి ఏ యాప్ ని కూడా మినిమైజ్ లో ఉంచొద్దు.అన్ని క్లోజ్ చేసి చార్జింగ్ పెట్టండి.

* మీ ఫోన్ చార్జర్ మాత్రమే ఉపయోగించండి.

బయటి చార్జర్స్ ఏవి వాడినా లాభం లేదు.ఒరిజినల్ ఇచ్చే వేగం మరో చార్జర్ ఇవ్వదు.

* ఇతర చార్జర్ వాడినప్పుడు మధ్యలో మరో కనెక్టర్ ఉండకుండా చూసుకోండి.

* చివరగా, మనలో చాలామంది చేసే పని ఇది, కాని మానుకోవాలి.

చార్జింగ్ లో ఉండగా మొబైల్ ని వాడొద్దు.ఓ చేత ముద్ద తింటూ, మరో చేత పనులు చేయదు కదా మన శరీరం ?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube