తిండి మెల్లిగా తినాలా? తొందరగా తినాలా?  

How To Eat? Fast Or Slow?-

English Summary:Arise late in the morning. Seen today aphiso moon clock, kalejo that there will be enlightenment.Gabagaba able to leave have been consumed by the gabagaba purticesukoni tasks. Busy life went on almost every day alike.On the other hand, are people. Whether he begins eating, eating so completed.Is he eating, Butch? Or, eat slowly? Alociste deeply, eat tondaratondaraga idemi is not running. Anarthalo gabagaba see how we eat.
* How much food will be suited to, say, your stomach where you can not stop eating, the brain. Can not find the time to send signals to the brain by eating gabagaba kadupuki.The tinestuntaru than necessary. Rather slow, content refers to the brain to stop eating and where.The low-calorie you are feeling.
* Gabagaba had said earlier that eating tinestuntaru than necessary.The problem of overweight mosukostayi involved in feeling more calories.
* Accelerated eating "Gastroesophagal reflux disease" pettoccu bother you with the problem.Causing digestive problems, chest modalavvoccu flame.
* Adarabadaraga your mind is eating, the stomach, the body was put in stress.

ఉదయం ఆలస్యంగా లేస్తారు. గడియారం వంక చూసేసరికి ఇవాళ ఆఫీసో, కాలేజో ఉందని జ్ఞానోదయం అవుతుంది. దాంతో గబాగబా పనులు పూర్తిచేసుకోని గబాగబా దొరికింది తినేసి బయలుదేరుతారు..

తిండి మెల్లిగా తినాలా? తొందరగా తినాలా?-

బిజీ జీవితంలో దాదాపు ప్రతిరోజూ ఇలానే గడుస్తోంది. ఇక మరోవైపు, కొంతమంది ఉంటారు. ఇలా తినడం మొదలుపెట్టారో లేదో, అలా తినడం పూర్తయిపోతుంది.

ఇలా గబగబా తినటం మంచిదేనా? లేదంటే మెల్లిగా తినాలా? లోతుగా అలోచిస్తే, తొందరతొందరగా తినటానికి ఇదేమి పరుగుపందెం కాదు. గబాగబా తినటం వల్ల ఎన్ని అనర్థాలో చూడండి.

* ఎంత తిండి సరిపోతుందో, ఎక్కడ తినడం ఆపాలో చెప్పేది మీ కడుపు కాదు, మెదడు.

గబాగబా తినటం వలన మెదడుకి సంకేతాలు పంపే సమయం కడుపుకి దొరకదు. దాంతో అవసరానికి మించి తినేస్తుంటారు. అలా కాకుండా నెమ్మదిగా, తృప్తిగా తినటం వలన ఎక్కడ ఆపాలో మెదడు సూచిస్తుంది.

దాంతో తక్కువ కాలరీలు మీ ఒంట్లో పడతాయి.

* ఇంతకుముందు చెప్పినట్లుగానే గబాగబా తినటం వలన అవసరానికి మించి తినేస్తుంటారు. దాంతో ఎక్కువ కాలరీలు ఒంట్లో చేరి అధికబరువు సమస్యను మోసుకొస్తాయి.

* త్వరత్వరగా తినటం వలన “Gastroesophagal reflux disease” అనే సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలే కాదు, ఛాతిలో మంట కూడా మొదలవ్వొచ్చు.

* ఆదరాబాదరగా తినటం అంటే మీ మెదడుని, కడుపుని, మొత్తం శరీరాన్ని స్ట్రెస్ లో పెట్టడం. తినేటప్పుడు కూడా బాడిని ఒత్తిడిలో పెట్టడం మంచి పద్ధతి కాదు.

* ఇక చివరగా చెబుతున్నా, చాలా ముఖ్యమైన విషయం. తిండి అనేది కేవలం ఆకలి కోసమే కాదు, రుచి కోసం కూడా తీసుకుంటాం మనం. ఆదరాబాదరగా తినేటప్పుడు తిండి మీద దృష్టి తక్కువ, చేయాల్సిన పని మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది.

ఇలా త్వరత్వరగా తినటం వలన తినే తిండిని, దాని రుచిని సరిగా ఆస్వాదించలేం. కాబట్టి తినేటప్పుడు తిండి తప్ప మరో ధ్యాస లేకుండా, మెల్లిగా తినాలి.