రొమ్ముల్లో కొవ్వు కరగాలంటే ఏం చేయాలి ?

How To Cut Down Fat In Women Breasts ?

ఒంట్లో ఏ భాగం లో ఉన్న , కొవ్వు అనేది ఏరకంగాను మంచిది కాదు.కాని మనం కేవలం పొట్టలో కొవ్వుని మాత్రమే గమనిస్తాం, దృష్టిలో పెట్టుకుంటాం.

 How To Cut Down Fat In Women Breasts ?-TeluguStop.com

పొట్ట పెరిగితే తప్ప, మనిషి అనారోగ్యంగా ఉన్నట్లు తెలుసుకోం.కొవ్వు ఎక్కడున్నా అది కొవ్వే.

అది ఎక్కడున్న చేయాల్సిన నష్టమే చేస్తుంది.ఇక స్త్రీలలో చూస్తే వక్షోజాల్లో కూడా కొవ్వు పేరుకుపోతుంది.

కాని అది వారు సరిగా గమనించరు.వక్షోజాలు పెద్దగా ఉండటం వేరు, వక్షోజాల్లో కొవ్వు చేరటం వేరు.

రొమ్ముల్లో గనుక కొవ్వు చేరితే, అది వక్షోజాల అందాన్ని దేబ్బతీయటమే కాదు, బ్రెస్ట్ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, చివరకి డయాబెటిస్ లాంటి సమస్యలని తీసుకొస్తుంది.కాబట్టి కేవలం పొట్టలో ఉండే కొవ్వుపైనే కాదు, రొమ్ముల్లో పేరుకుపోయే కొవ్వు మీద దృష్టి నిలిపి, కొవ్వు కరిగించుకోవాలి.

మరి అక్కడ కొవ్వు కరగాలంటే ఏం చేయాలి ? ఏం తినాలి ? ఎలాంటి వ్యాయామాలు చేయాలి ?

* అల్లం మెటబాలిజం రేటుని మెరుగుపరుస్తుంది.మెటబాలిజం రేటు బాగుంటే కాలరీలు, కొవ్వు కరిగిపోతుంటాయి.

అందుకే, అల్లం ఆడవారి డైట్ లో ఉండాలి.అల్లం టి తయారుచేసుకొని రోజు తాగితే మేలు.

ఈ అల్లం టీని తయారుచేసుకోవడం కూడా పెద్ద కష్టమైన పనేమీ కాదు.సింపుల్ గా కొన్ని అల్లం ముక్కలను కోసుకొని, వాటిని మంచి నీటిలో వేసి ఓ పది నిమిషాలపాటు మరిగించండి.

ఆ నీటినే రోజు టీ లాగా తాగండి.

* ఈతకొట్టే అలవాటు ఉంటే మంచిది.

ఈత రాకపోతే నేర్చుకోండి.ఎందుకంటే ఒంట్లో కొవ్వుని అతి సులువుగా కరిగించవచ్చు ఈత కొట్టడం వలన.ఏరోబిక్ వ్యాయామాలు కూడా ఛాతి భాగంలో కొవ్వుని కరిగిస్తాయి.నిజానికి ఈ వ్యాయామాలు మిగితా వ్యయామాల కన్నా ఎక్కువగా వక్షోజాల్లోని కొవ్వుపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి.

శరీరం సహకరిస్తే పుష్ అప్స్ చేస్తే ఇంకా మేలు.ఈ టైప్ వ్యాయామాలు కూడా వక్షోజల్లో కొవ్వుని కరిగిస్తాయి.

* వేపాకులో యాంటి ఇంఫ్లెమేంటరి, యాంటి బ్యాక్తీరియాల్ మరియు యాంటి వైరల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి.ఒక్కోసారి వైరల్ ప్రభావం వలన, మంట వలన కూడా కొవ్వు పెరగవచ్చు .అలాంటప్పుడు ఇవి ఒంట్లో కొవ్వుని కరిగించేందుకు పనికొస్తాయి.

* గ్రీన్ టీ తాగడం వలన శరీరం ఎన్ని లాభాలు పొందుతుందో కొత్తగా చెప్పేదేముంది.ఇందులో యాంటిఆక్సిడెంట్స్ దండిగా లభిస్తాయి.దాంతో ఒంట్లో కొవ్వుని కరిగించే పదార్థాలలో గ్రీన్ టీ ముందు వరుసలో ఉంటుంది.

రోజు 2 కప్పుల గ్రీన్ టీ తాగే అలవాటు చేసుకోండి చాలు, కేవలం వక్షోజాల దగ్గరి కొవ్వు మాత్రమే కాదు, ఒంట్లో కొవ్వంతా కరిగిపోతుంది.

* స్త్రీలలోని ప్రధాన హార్మోన్ అయిన ఈస్ట్రోజెన్ లెవల్స్ శరీరంలో మరీ ఎక్కువ అయినా, వక్షోజాల్లో కొవ్వు పేరుకుపోతుంది.

అలాంటప్పుడు హార్మోన్ లెవల్స్ ని కంట్రోల్ లోకి తేవాలి.అలా తేవాలి అంటే ఫ్లాక్స్ సీడ్ టీ తాగాలి.ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాట్టి ఆసిడ్స్ ఉంటాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube