ఈ డ్రింక్ త్రాగితే మీ నొప్పులన్నీ గంటలో తగ్గిపోతాయి     2018-01-12   21:31:40  IST  Lakshmi P

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారికి కీళ్ల నొప్పులు వస్తూ ఉన్నాయి. మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్ల కారణంగా కీళ్లనొప్పులు వస్తున్నాయి. శరీర బరువు మొత్తం మోకాళ్ళ మీదే ఉంటుంది. ఎక్కువసేపు నిల్చోవటం,కింద కూర్చోవటం,నడవటం వంటి కారణంగా మోకాళ్ళ మీద భారం పడి మోకాళ్ళ నొప్పులు ప్రారంభం అవుతాయి. 30 సంవత్సరాలు దాటినా మహిళల్లో ఎముకలు బలహీనంగా మారటం వలన కీళ్లనొప్పులు వస్తాయి.

అంతేకాక కీళ్లు వాపునకు కూడా గురవుతాయి. నడిచినప్పుడు కీళ్లు కదిలినప్పుడు ఎముకలు రాపిడికి గురి అయినప్పుడు కీళ్ల మధ్య ఉండే కార్డిలైజ్ అనే గుజ్జు తగ్గిపోవటం వలన మోకాళ్ళ నొప్పులు మొదలు అవుతాయి. దీని కారణంగా కూర్చోవాలన్న, నడవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి కీళ్లనొప్పులను అయినా తగ్గించే అద్భుతమైన చిట్కా ఉంది. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులను తగ్గించే చిట్కా గురించి తెలుసుకుందాం.


అర స్పూన్ పసుపులో ఒక స్పూన్ పంచదార,చిటికెడు మంచి సున్నం వేసి నీటిని చేరుస్తూ పేస్ట్ గా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ని రాత్రి పడుకొనే ముందు మోకాళ్ళ మీద రాసి సున్నితంగా పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత కాటన్ క్లాత్ తో కవర్ చేసుకొని పడుకోవాలి. ఉదయం లేవగానే ఆ క్లాత్ తీసేసి గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

ఈ విధంగా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు లేదా పాలల్లో పావు స్పూన్ పసుపును కలిపి త్రాగాలి. పసుపులోని యాంటీ ఇన్ఫలేమిటరీ లక్షణాలు రక్త సరఫరాను మెరుగుపరచి కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. ఇది కీళ్లనొప్పులను తగ్గించటమే కాకుండా ఇతర నొప్పులు తగ్గటంలో కూడా సహాయపడుతుంది. మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు ఎక్కువ సేపు నడవటం,నిల్చోవటం,కింద కూర్చోవటం వంటివి చేయకూడదు. ఈ విధంగా చేయటం వలన మోకాళ్ళపై బరువు పెరిగి కీళ్లనొప్పులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.