2 నిమిషాల్లో నోటి దుర్వాసన తగ్గాలంటే అద్భుతమైన సులభమైన ఇంటి చిట్కా  

నోటి దుర్వాసన సమస్య చిన్నగా అనిపించిన నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఆ సమస్య కారణంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. బయటకు వెళ్ళినప్పుడు నలుగురితో మాట్లాడాలంటే ఇబ్బంది కలుగుతుంది. దాంతో కొంత ఆత్మన్యూన్యత భావనకు గురి కావటం జరుగుతుంది. దాంతో చాలా మంది నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి మార్కెట్ లో దొరికే మౌత్ వాష్ లను ఆశ్రయిస్తూ ఉంటారు. దాని కోసం చాలా డబ్బును వేస్ట్ చేసేస్తూ ఉంటారు. ఆలా కాకుండా ఇంటిలోనే తక్కువ ఖర్చుతో మౌత్ వాష్ తయారీ గురించి తెలుసుకుందాం.

బేకింగ్ సోడా నోటి దుర్వాసనను తరిమి కొట్టటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అరకప్పు నీటిలో అరస్పూన్ బేకింగ్ సోడా కలపాలి. ఈ నీటిని నోటిలో పోసుకొని బాగా పుక్కిలించి ఉమ్మేయాలి. ఈ నీటిని ఒకసారి తయారుచేసుకుంటే మూడు రోజుల వరకు ఉపయోగించవచ్చు.


ఒక కప్పు వెచ్చని నీటిలో పావు కప్పు బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు కలిపాలి. ఈ మిశ్రమాన్ని నోట్లోకి తీసుకొని బాగా పుక్కిలించి ఉమ్మేయాలి. ఇది నోటి పుళ్లను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్‌ వంట సోడా కలపాలి. దీనికి పెప్పర్‌మెంట్‌ను కలపడం వల్ల నోట్లోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. ఈ మిశ్రమంతో నోటిని పుక్కిలిస్తే చాలా సేపు తాజాగా కూడా ఉంటుంది.

నీటిలో తగిన మోతాదులో తేనె, నిమ్మ రసం కలిపి కూడా మౌత్ వాష్ గా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని త్రాగిన ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ మౌత్ వాష్ గొంతు నొప్పి, గొంతు సంబంధిత వ్యాధులను కూడా బాగా నయం చేస్తుంది.