డ్రాగన్ ఫ్రూట్( Dragon Fruit ) లో మంచి పోషకాలు ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కూడా సాగు లోకి వస్తోంది.
అయితే ఈ పంట సాగు చేయడానికి పెట్టుబడి కాస్త ఎక్కువే.సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్స్ సాగు చేస్తే నాలుగు సంవత్సరాల తర్వాత పంట చేతికి వస్తుంది.
కానీ ట్రెల్లీస్ పద్ధతిలో సాగు చేస్తే రెండు సంవత్సరాల లోనే పంట చేతికి వస్తుంది.ఒక ఏకంగా నాటిన తర్వాత 25 నుంచి 30 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తూనే ఉంటుంది.
డ్రాగన్ ఫ్రూట్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి.అమెరికన్ బ్యూటీ, తైవాన్ పింక్, మొరాకిన్ రెడ్, డిలైట్, షుగర్ డ్రాగన్, సీయం రెడ్ లాంటి రకాలు ఉన్నాయి.
సాధారణ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే ఎకరాకు 2000 మొక్కలు, ట్రెల్లీస్ పద్ధతిలో సాగు చేస్తే ఎకరాకు మూడు వేల మొక్కలు నాటుకోవాలి.ఇంకా కావాలంటే ట్రెల్లీస్ పద్ధతిలో దాదాపుగా 6000 మొక్కలు నాటుకోవచ్చు.

డ్రాగన్ ఫ్రూట్ అనేది ఓ ఎడారి మొక్క కాబట్టి నీటి చాలా తక్కువ.డ్రిప్ ఇరిగేషన్( Drip irrigation ) పద్ధతిలో వారానికి ఒకసారి ఒకటి లేదా రెండు గంటలసేపు నీళ్లు ఇస్తే సరిపోతుంది.ఆన్ సీజన్ లో మొక్కలకు వెలుతురు కావాలి.ఒక ఎకరాకు 500 ఎలక్ట్రిక్ బల్బులు అవసరం.రోజుకు నాలుగు గంటలు లైటింగ్ ఇస్తే సరిపోతుంది.

ట్రెల్లీస్ పద్ధతి అంటే అల్ట్రా హై డెన్సిటీ( Ultra high density) విధానంలో డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేయడం.అంటే 2000 మొక్కలు నాటిన చోట ఏకంగా 6 మొక్కలు నాటుకోవడం.మొదటి ఏడాది రెండు టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
అలాకాకుండా ట్రెల్లీస్ పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి దాదాపుగా ఐదు టన్నుల దిగుబడి పొందవచ్చు.పంట కోసం పెట్టిన పెట్టుబడి అంతా మూడు సంవత్సరాల లోపు చేతికి వస్తుంది.
ప్రతి సంవత్సరం పంట దిగుబడి పెరుగుతూనే ఉంటుంది.ఒక ఎకరం లో సాగు చేయడానికి 250 స్థంబాలు 10 అడుగులవి అవసరం అవుతాయి.250 స్తంభాలు 6 అడుగులవి అవసరం అవుతాయి.ఈ పంట మధ్యలో కావాలంటే ఇతర అంతర పంటలు కూడా సాగు చేయవచ్చు.