ఒక మనిషి జీవితం అనేది మరో మనిషికి సాయం చేసినప్పుడు కంటే మరో ప్రాణం పోసినప్పుడు సఫలం అవుతుంది.అమ్మాయి లేదా అబ్బాయి తల్లి లేదా తండ్రి అయినప్పుడు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు.
భార్య భర్తల మద్య అన్యోన్యం అనేది తల్లిదండ్రులు అయిన తర్వాత మరింతగా పెరుగుతుంది.పిల్లలు ఉన్నప్పుడే ఆ సంసారం సంతోషంగా సాగుతుందనేది పెద్దల మాట.ఎంతో మంది పిల్లలు లేని వారు కలహాలతో కాపురం చేస్తూ ఉంటారు.అలాంటి జంట తల్లిదండ్రులం కాబోతున్నామని తెలియగానే సంతోషానికి అవదులు ఉండవు.
స్త్రీ గర్భం దాల్చింది అనే విషయం తెలియాలి అంటే రక్త పరీక్ష లేదా మూత్ర పరీక్ష చేయాలి.కాని ఆ పరీక్షలు చేయకుండానే ఈ విషయాలను గమనిస్తే గర్బవతి అనే విషయం తెలుసుకోవచ్చు.ఇప్పుడు ఆ పరీక్షలు ఏంటో చూద్దాం.ప్రతి నెల వచ్చే రుతుక్రమం పది, ఇరవై రోజులు అయినా రాకపోతే గర్బం దాల్చినట్లుగా భావించవచ్చు.
అయితే కొందరికి అనారోగ్య కారణం లేదా ఇతరత్ర కారణాల వల్ల ఆలస్యంగా రుతుక్రమం అవుతుంది.రుతుక్రమం రాకుండా ఉండి ఈ క్రింది లక్షణాలు ఉంటే అప్పుడు ఖచ్చితంగా గర్బం దాల్చడమే అన్నట్లుగా భావించవచ్చు.
గర్బం దాల్చిన స్త్రీ తరచూ మూత్రంకు వెళ్లాల్సి వస్తుంది.కొత్తగా పిండం ఏర్పడటం వల్ల ఆ పిండం మూత్రాశయంపై ఒత్తిడి పెంచుతూ ఉంటుంది.
దాంతో స్త్రీ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.గర్బంతో ఉన్న స్త్రీ ఏ చిన్న పని చేసినా కూడా వెంటనే అలసి పోయినట్లుగా అనిపిస్తుంది.
శక్తి చాలా తక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.ఈ లక్షణాలు కనిపిస్తే గర్బవతిగా భావించవచ్చు.
నోటికి ఏది రుచిగా అనిపించకపోవడం, ఏదైనా కొత్తగా తినాలి అనిపించడం, కొత్త రుచులను నాలుక కోరుకోవడం వంటివి జరుగుతుంది.నాలుక రుచులు కోరుతుంది అంటే ఖచ్చితంగా ఆ లక్షణం గర్బవతి అవ్వడమే.ఉదయం లేవగానే వాంతులు వచ్చినట్లుగా అనిపించడం, ఏది తినాలనిపించక పోవడం, వికారం అనిపించడం కూడా గర్బవతి లక్షణమే.ఇక గర్బం దాల్చిన వారి వక్షోజాల్లో మార్పులు వస్తూ ఉంటాయి.
బిడ్డలకు పాలు ఇచ్చేందు కోసం అని గర్బం దాల్చిన వెంటనే వక్షోజాలు పెద్దగా అవ్వడంతో పాటు, మెల్ల మెల్లగా పాలు కూడా వస్తూ ఉంటాయి.గర్బం దాల్చిన కొందరిలో బాగా ఆకలిగా ఉంటుంది.
కడుపులో ఉండే పిండంకు రోజుకు 300 కేలరీల శక్తి అవసరం ఉంటుంది. అందుకే స్త్రీకి పదే పదే ఆకలి అవుతూ ఉంటుంది.
ఈ లక్షణాల్లో రెండు, మూడు ఉన్నా కూడా కన్ఫర్మ్గా గర్బవతి అని నిర్థాణ చేసుకోవచ్చు.అప్పుడు టెస్టు చేసుకోవచ్చు.