స్మార్ట్ ఫోన్ కొనేముందు ఇవన్ని ఆలోచించాలి

తిండి, బట్ట, ఇల్లు, నిద్ర .వీటి తరువాత మనకు అత్యవసరమైనది ఏంటి అంటే నిర్మొహమాటంగా స్మార్ట్ ఫోన్ అని చెప్పాలేమో! మన జీవితంలో అత్యవసర వస్తువుగా మారిపోయిన స్మార్ట్ ఫోన్ ని కొనాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఎన్ని రకాలుగా ఆలోచించాలి ?

 How To Choose An Ideal Smartphone?-TeluguStop.com

* స్మార్ట్ ఫోన్ అనగానే అందరి దృష్టి కెమెరా ఎన్ని పిక్సెల్స్ అనే విషయం మీదకే వెళుతుంది.అయితే ఫోన్ కేవలం కెమెరా కోసమే వాడుకోం కదా.మరో విషయం ఏమిటంటే, ఏ కంపెనీ ఎలాంటి కెమెరా లెన్స్ వాడుతుందో తెలుసుకోవాలి.కేవలం గుడ్డిగా పిక్సెల్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని నమ్మేయకూడదు.

* కేవలం పాపులారిటిని బట్టి ఫోన్ కొనొద్దు.ఒకప్పుడు అందరు నోకియా లూమియా అని ఎగబడ్డారు.ఎందుకు అంటే, నోకియా ఫేమస్ కాబట్టీ.

ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ అదే మొబైల్ ని తయారుచేస్తున్న జనాల్లో సంతృప్తి ఉండట్లేదు.విండోస్ ఫోన్ ఫేమసే కాని, అన్ని ఫీచర్స్ అందించదు.

సామ్ సంగ్ విక్రయాలు ఎందుకు పడిపోయాయి? పాపులర్ కంపెనీయే కదా ? అందుకే జాగ్రత్తగా మన ఫోన్ ని ఎంచుకోవాలి.

* ఒక మోడల్ విడుదల అవగానే తొందరపడి కొనేయొద్దు.

దాని తరువాత మరో మోడల్ వస్తుంది.నచ్చితే కొత్త మోడలే కొనండి లేదంటే తక్కువ రేటులో పాత మోడల్ ని తక్కువ రేటులో జేబులో వేసుకోండి.

ఎందుకంటే కొత్త మోడల్ విడుదలయ్యాక, పాత మోడల్ ధరని తగ్గించేస్తుంటాయి కంపెనీలు.

* వ్యారంటీ, సర్వీస్ సెంటర్లు గమనించి కొనాలి.

షియోమి రెడ్ మీ లాంటి కంపెనీల ఫోన్లకి భారి అమ్మకాలు జరుగుతున్నాయి.ఆ కంపెనీ వ్యారంటి ఇవ్వట్లేదు అని కాదు కాని, సర్వీసు సెంటర్లు సరిగా అందుబాటులో ఉండట్లేదు.

మహానగరాల ప్రజలకు ఓకే కాని, టౌన్, గ్రామాల ప్రజలు ఫోన్లో సమస్య వస్తే మైళ్ళ దూరం వెళ్ళాల్సిన పరిస్థితి.కాబట్టి కంపెనీ సర్వీస్ మనకి అందుబాటులో ఉందో లేదో గమనించాలి.

* స్పెసిఫికేషన్స్ అన్ని గమనించాలి.మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాసెసర్ ఏంటి ? మనం కొనాలనుకునే ఫోన్ ప్రాసెసర్ ఏంటి … ఇలా ప్రతి స్పెసిఫీకేషన్ ని బాగా గమనించి నిర్ణయానికి రావాలి.అలాగే మీ అవసరాన్ని బట్టి, కెమెరా బాగున్న ఫోన్ కావాలో, బ్యాటరీ బాగా ఉన్న ఫోన్ కావాలో, ర్యామ్ బాగున్న ఫోన్ కావాలో నిర్ణయించుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube