మార్చి 31 తరువాత జియో ప్రస్తుత సేవల కోసం ఇలా చేయాలి  

How To Change Your Jio Number To Jio Prime ? -

మరో నెల గడిస్తే చాలు, జియో ఉచిత సేవలు అందించడం మానేస్తుంది.జూన్ వరకు ఉచిత సేవలను పొడిగించడం, మూడు నెలల కోసం 100 రూపాయలు కట్టమనడం .

ఇవన్ని రూమర్స్.ఇక నిజం ఏమిటంటే, మార్చి 31 తరువాత జియో వినియోగదారులు రెండుగా విడదీయబడతారు.

How To Change Your Jio Number To Jio Prime -General-Telugu-Telugu Tollywood Photo Image

నార్మల్ జియో యూజర్లు, జియో ప్రైమ్ (Jio Prime) యూజర్లు.మామూలు జియో యూజర్లు ఇప్పటిలాగా రోజుకి 1 GB డేటా సేవలను పొందలేరు.

ప్రతి GB డేటాకి డబ్బులు చెల్లించాల్సిందే.ఇక జియో ప్రైమ్ సేవలకి కూడా చెల్లింపులు చేయాల్సిందే కాని, నార్మల్ జియో కన్నా, జియో ప్రైం చాలా అంటే చాలా చవక.

ఇప్పటిలాగా రోజుకి 1 GB డేటా రావాలి అంటే జియో ప్రైమ్ కి వెళ్ళాల్సిందే.ఏడాదికి జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ రేటు 99 రూపాయలు.

ప్రతి 1 GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, జియో ప్రీమియం యాప్స్, ఇవన్ని కావాలంటే మాత్రం నెలకు 303 రూపాయలు చెల్లించాల్సిందే.అంటే, 1 GB డేటా కేవలం 10 రూపాయలకే దొరుకుతుందన్నమాట.

మరి జియో ప్రైమ్ కి ఎలా మారాలి ? ఇదేగా మీ డౌటు ?

చాలా సింపుల్ .మొదట PORT(మీ నంబర్) ని 1900 కి మెసేజ్ చేయండి.మీకు UPC (Unique Portability Code) మరియు రిఫరెన్స్ కోడ్ మెసేజ్ రూపంలో వస్తుంది.ఆ తరువాత మై జియో యాప్ నుంచి బార్ కోడ్ జెనరేట్ చేసి, దగ్గరిలోని రిలయెన్స్ డిజిటల్ ఎక్స్ప్రెస్ స్టోర్ కి వెళ్ళండి.

మీ UPC, రిఫరెన్స్ కోడ్, బార్ కోడ్, ఆధార్ వారికి చూపిస్తే, వెరిఫై చేసి మీకు మరో జియో సిమ్ ని అందిస్తారు.అదే జియో ప్రైమ్.

తాజా వార్తలు

How To Change Your Jio Number To Jio Prime ?- Related....