మీ స్టార్ట్ ఫోన్ లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ని ఎలా మార్చాలి?

గూగుల్ వర్చువల్ అసిస్టెంట్ అనేది స్మార్ట్ ఫోన్లలో ముఖ్యమైన ఫీచర్.సాధారణంగా గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత స్మార్ట్ అసిస్టెంట్ ను ఒకే వాయిస్ స్టయిల్ లో వింటుంటాము.

 How To Change Google Assistant Voice In Your Smart Phone Details, , Google Assis-TeluguStop.com

అయితే ఓకే వాయిస్ బోర్ కొడుతుంటే గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ని మార్చుకోవచ్చు.ఇంగ్లీష్ మాట్లాడేవారి కోసం గూగుల్ 10 వాయిస్ లను అందుబాటులోకి తెచ్చింది.

అందులో 6 ఆడ, 4 మగ వాయిస్ లు ఉన్నాయి.మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, ఆపిల్ ఫోన్, మీ స్మార్ట్ డిస్ ప్లేలో గూగుల్ వాయిస్ ఎలా మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ మార్చడం ఎలా?

స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ పోన్ లో Google అసిస్టెంట్ ని యాక్టివేట్ చేయాలి.అందుకోసం మీ స్మార్ట్ ఫోన్ లో ముందుగా ‘హే గూగుల్’ అని చెప్పడం లేదా గూగుల్ అసిస్టెంట్ బటన్ ని క్లిక్ చేయాలి.
స్టెప్ 2: ఇప్పుడు ‘ఛేంజ్ యువర్ వాయిస్’ అని చెప్పాలి.
స్టెప్ 3: స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై కనిపించే మ్యానేజ్ వాయిస్ సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 4: మీకు కావాల్సిన వాయిస్ కోసం వాయిస్ ప్రీసెట్ ద్వారా స్క్రోల్ చేయండి.మీ నచ్చిన వాయిస్ మీద క్లిక్ చేయండి.

ఇప్పుడు మీరు ‘ఓకే గూగుల్’ అని చెప్పిన ప్రతిసారీ సరికొత్త వాయిస్ వస్తుంది.

Telugu Androind Phone, Changegoogle, Iphone, Smart Display, Smart Phone, Ups-Lat

గూగుల్ యాప్స్ లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ని ఎలా మార్చాలి?

స్టెప్ 1: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ యాప్ ని తెరవండి.
స్టెప్ 2: కుడి వైపు ఎగువ మూలలో ఉన్న మీ ప్రొఫైల్ గుర్తుపై క్లిక్ చేయండి.
స్టెప్ 3: తర్వాత సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: గూగుల్ అసిస్టెంట్ ని ఎంచుకోండి.
స్టెప్ 5: అన్ని సెట్టింగ్స్ విభాగంలో అసిస్టెంట్ వాయిస్ మరియు సౌండ్స్ ఎంపిక చేసుకోండి.
స్టెప్ 6: మీకు నచ్చిన వాయిస్ ని ఎంచుకోండి.

Telugu Androind Phone, Changegoogle, Iphone, Smart Display, Smart Phone, Ups-Lat

ఐఫోన్ లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ని ఎలా మార్చాలి?

స్టెప్ 1: ఐఫోన్ లో గూగుల్ అసిస్టెంట్ యాప్ ని ఓపెన్ చేయండి.
స్టెప్ 2: కుడివైపు ఎగువ మూలన మీ ప్రొఫైల్ గుర్తును ఎంచుకోండి.
స్టెప్3: అసిస్టెంట్ వాయిస్ పై క్లిక్ చేయండి.
స్టెప్4: మీకు కావాల్సిన వాయిస్ ని ఎంచుకోండి.

స్మార్ట్ డిస్ ప్లేలో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ని ఎలా మార్చాలి?

స్టెప్1: గూగుల్ స్మార్ట్ డిస్ ప్లేలో Google Home యాప్ ని ఓపెన్ చేయండి.
స్టెప్ 2: డిస్ ప్లే కుడివైపు ఎగువ మూలలో మీ ప్రొఫైల్ ఫొటోను క్లిక్ చేయండి.
స్టెప్ 3: తర్వాత అసిస్టెంట్ సెట్టింట్స్ ఎంపికపై క్లిక్ చేయండి.
స్టెప్ 4: ‘All Settings’ విభాగంలో అసిస్టెంట్ వాయిస్ ఎంపికపై క్లిక్ చేయండి.
స్టెప్ 5: మీకు కావాల్సిన వాయిస్ ని ఎంచుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube