నరకచతుర్దశి రోజు ఏం చేయాలి.? కష్టాలు తొలగాలంటే పాటించాల్సిన నియమాలు, పటించాల్సిన మంత్రాలు ఇవే.!  

How To Celebrate Narak Chaturdashi-

‘ధన త్రయోదశి’ మరునాడే నరక చతుర్దశి.నరకం నుంచి విముక్తి కోసం చేసే యమ ధర్మరాజు ప్రీత్యర్థం జరుపుకొనే పండుగగా ‘నరక చతుర్దశి’ మొదలైందట.కానీ, ఆ తరువాతి కాలంలో ప్రాగ్జ్యోతిష పురాన్ని (ఇవాళ్టి అస్సామ్ ప్రాంతం) పాలించిన నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు వధించిన సందర్భాన్ని పురస్కరించుకొని, ‘నరక చతుర్దశి’ జరుపుకోవడం ప్రాచుర్యంలోకి వచ్చింది.

How To Celebrate Narak Chaturdashi--How To Celebrate Narak Chaturdashi-

ఈ పండుగను ‘దసరా’ లానే జరుపుకొంటారు.దసరాకు రావణాసురుడి దిష్టిబొమ్మలు చేసి, దహనం చేస్తారు.నరక చతుర్దశికేమో నరకాసురుడి బొమ్మ దహనం చేస్తారు.వేకువనే బొమ్మ దహనం చేసి, టపాకాయలు కాల్చి, ఇంటికి వచ్చి తలంటు స్నానం చేస్తారు.

ఈ రోజు తెల్లవారకముందే నువ్వులనూనే తలపై వేసుకుని ” ఉత్తరేణి” కొమ్మను నెత్తి మీద ఉంచుకుని తలంటుకోవాలి.

అలా తలంటుకునేటప్పుడ“ శీతలోష్ణ సమాయుక్త సకంటకదళాన్విత హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః అని చెప్పుకోవాలి.

స్నానాంతరం నల్లనువ్వులతో

“యమాయ తర్పయామి తర్పయామి తర్పయామి ” అంటూ యమతర్పణం విడవాలి.నరకాసురుడు మరణించిన సమయం అది.

ఆపై

ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టుకోవాలి.ఆ రోజు మినపాకులతోకూర వండుకు తినాలి.వీలుకాకపోతే మినపగారెలైనా సరే.నరకచతుర్దశినే ప్రేతచతుర్దశి అని కూడా అంటారు.

సాయంత్రమయ్యాక ప్రదోషకాలంలో పూజ చేస్తారు.నరకం పాలు కాకుండా ఉండేందుకూ, పాపాలన్నీ పోగొట్టుకొనేందుకూ ఆ సమయంలో నాలుగు వత్తులతో సంప్రదాయబద్ధంగా ఒక దీపం వెలిగిస్తారు.‘దత్తో దీప శ్చతుర్దశ్యామ్ నరక ప్రీతయే మయా, చతుర్వర్తి సమాయుక్తః సర్వపాపాపనుత్తయే’ అంటూ ‘లింగ పురాణం’లోని శ్లోకం చదువుతారు.

ఈ చతుర్దశికి నరకాధిపతి ప్రీతి కోసం, పాపాలన్నీ పోగొట్టుకోవడం కోసం ఈ నాలుగువత్తుల దీపం వెలిగిస్తున్నానని అర్థం.అలాగే శివపూజ చేస్తారు.

శాస్రాల్లో ప్రదోషకాలాన చేసే ఈ దీపదానాల వల్ల రెండు విధాలైన ఉపయోగాలు ఉన్నట్లు చెప్పబడింది.

ఈ దీపాలు నరకలోకవాసులకు వలసిన వెలుతురును ఇస్తాయి.ఈ దీపదానాలవల్ల ఇక్కడి వారికి యమమార్గాధికారుల బాధ లేకుండా పోతుంది, నరక బాధ తప్పిపోతుంది.