బియ్యానికి పురుగులు ప‌డుతున్నాయా? అయితే ఈ టిప్స్ మీకే!

సాధార‌ణంగా ఒక్కోసారి బియ్యానికి పురుగులు ప‌ట్టేస్తూ ఉంటాయి.అటు వంటి బియ్యాన్ని వాడేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు.

 How To Avoid Worms In Stored Rice! Rice, Worms, Worms In Rice, Home Remedies, La-TeluguStop.com

పైగా బియ్యం నుంచి పురుగుల‌ను వేరు చేయ‌డం కూడా ఎంతో శ్ర‌మ‌తో కూడుకున్న ప‌ని.అందుకే బియ్యానికి పురుగులు ప‌ట్టాక బాధ ప‌డ‌టం కంటే ప‌ట్ట‌కుండా ముందే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మేలు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ఈజీ టిప్స్‌ను పాటిస్తే గ‌నుక పురుగులు బియ్యం ద‌రి దాపుల్లోకి కూడా రావు.మ‌రి ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

బియ్యానికి పురుగులు ప‌ట్ట‌కుండా అడ్డ క‌ట్ట వేయ‌డంలో ఇంగువ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.బియ్యంలో కొద్దిగా ఇంగువ‌ను వేసి బాగా క‌లుపుకోవాలి.ఇలా చేస్తే ఇంగువ నుంచి వెలువ‌డే ఘాటైన వాస‌న‌కు పురుగులు రాకుండా ఉంటాయి.

బియ్యానికి పురుగులు ప‌ట్ట‌డానికి తేమ కూడా ఒక కార‌ణంగా చెప్పుకొచ్చు.

అందుకే బియ్యంలో తేమ లేకుండా చూసుకోవాలి.అందుకు బోరిక్ పౌడ‌ర్ స‌హాయ‌ప‌డుతుంది.బియ్యంలో కొద్దిగా బోరిక్ పౌడ‌ర్‌ను క‌లిపితే.అది తేమ‌ను పిల్చేస్తుంది.

Telugu Bitter Guard, Camphor, Tips, Inguva, Insects Rics, Latest, Worms, Worms S

అలాగే క‌ర్పూరాన్ని మెత్త‌గా పొడి చేసి ఒక క్లాత్‌లో పెట్టి మూట‌ క‌ట్టాలి.ఇప్పుడు బియ్యం మ‌ధ్య‌లో ఈ క‌ర్పూరం మూటను ఉంచాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ర్పూరం వాస‌న‌కు బియ్యంలో పురుగులు ప‌డ‌కుండా ఉంటాయి.

కాక‌ర కాయ‌లు సైతం బియ్యానికి పురుగులు ప‌ట్ట‌కుండా చేయ‌గ‌ల‌వు.

ముదురు కాక‌ర కాయ‌ల‌ను తీసుకుని ముక్క‌లుగా క‌ట్ చేసి బాగా ఎండ బెట్టుకోవాలి.ఇప్పుడు ఈ ముక్క‌ల‌ను ఒక క్లాత్‌లో చుట్టి బియ్యంలో వేయాలి.

ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇక బియ్యంలో ఎండు మిర‌ప‌కాయ‌లు లేదా ల‌వంగాలు లేదా వెల్లుల్లి రెబ్బ‌లు వేసినా పురుగులు ప‌ట్ట‌వు.

ఒక‌వేళ ప‌రుగులు ఉన్నా.అవి చ‌చ్చి పోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube