వడదెబ్బ నుండి బయటపడటానికి అద్భుతమైన చిట్కాలు

వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరు వడదెబ్బ గురించి భయపడుతూ ఉంటారు.ఎటువంటి రక్షణ లేకుండా ఎండలో ఎక్కువగా తిరిగితే వడదెబ్బ బారిన పడుతూ ఉంటాం.

 Sunstroke,onions Summer,heat, Temperature High,juices-TeluguStop.com

సాధారణంగా మన శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ ఉంటుంది.ఆ వ్యవస్థ అదుపు తప్పినప్పుడు వడదెబ్బకు గురి అవుతూ ఉంటాం.

సాధారణంగా ఈ వడదెబ్బ చిన్న పిల్లలు,ముసలి వారికి ఎక్కువగా తగులుతుంది.ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి ఎండలో తిరగకూడదు.

ఒకవేళ తిరిగితే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది.ఇప్పుడు వడదెబ్బ నుండి బయట పడటానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

వడదెబ్బ లక్షణాలు కన్పించగానే ఒక కప్పు నీటిలో చింతపండు,తేనే,పంచదార వేసి త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

Telugu Sunstroke, Temperature-Telugu Health - తెలుగు హెల్త

కొత్తిమీర,పుదీనా రసాలకు కొంచెం పంచదార కలిపి త్రాగితే వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది.వడదెబ్బకు నివారించటానికి మజ్జిగ, కొబ్బరినీళ్లు బాగా సహాయపడతాయి.అలాగే చెమట ఎక్కువగా పట్టినప్పుడు ఆ నీటిని భర్తీ చేయటానికి కూడా బాగా సహాయపడతాయి.

వడదెబ్బ తగిలిందని అనుమానం వచ్చిన వెంటనే ఏదైనా పండ్ల రసాన్ని త్రాగాలి.అలాగే ఒక గ్లాస్ నీటిలో చిటికెడు బేకింగ్ సోడా,చిటికెడు ఉప్పు కలిపి త్రాగిన మంచి ఉపశమనం కలుగుతుంది.

ఇలా ప్రతి అరగంటకు త్రాగుతూ ఉంటే తొందరగా వడదెబ్బ నుండి బయట పడవచ్చు.

వడదెబ్బ నుండి బయట పడటానికి ఉల్లిపాయ రసం బాగా సహాయపడుతుంది.

ఉల్లిపాయ రసం శరీర ఉష్ణోగ్రతను తగ్గించటానికి సహాయపడుతుంది.ఉలిపాయ రసాన్ని చాతి భాగంలో రాయాలి.

లేదా ఉల్లిపాయ ముక్కలను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube