అయ్య బాబోయ్: చీమలు వరదల నుంచి ఎలా తప్పించుకుంటాయంటే..?!

ఈ లోకంలో చీమలపై చాలా మంది పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.చీమలను చూసి చాలా మంది ఎన్నో పాఠాలను నేర్చుకుంటున్నారు.

 How The Ants Are Saving From The Floods With Unity , Ants, Flould, Viral Video,-TeluguStop.com

చీమలు అంటే ఒక గౌరవ ప్రదమైన సహనం, ఓర్పు, ఐకమత్యం వంటి కొన్ని కథలను చెబుతుంటారు.చీమల దండుపై అధ్యయనంలో మరో విషయం తెలిసింది.

తాజాగా ఈ అధ్యయనంలో చీమలు చేసే ఓ ఐడియా అనేది పరిశోధకులు గుర్తించారు.సాధారణంగా వరదలు, వంకలు వస్తే ప్రజలు కొట్టుకుపోతారు.

అయితే ఇలా చీమలు మాత్రం వరదల్లో కొట్టుకు పోకుండా ఓ ఐడియాను పాటిస్తున్నాయి.వరదల్లో కొట్టుకుపోకుండా చీమలు తమ దండుతో కలిసికట్టుగా ఐకమత్యంతో తప్పించుకోవడాన్ని పరిశోధకులు గుర్తించారు.

వరదలు అనేవి వచ్చినప్పుడు పైర్ ఆంట్స్ అంటే ఎర్ర, నల్ల గండు చీమలు అనేవి ఎలా తప్పించుకుంటున్నాయి అనే దానిపై పరిశోధనలు జరిగాయి.ఆ రకానికి చెందిన చీమలపై శాస్త్రవేత్తలు పలు అధ్యయనాలు చేసి ఓ విషయాన్ని కనుగొన్నారు.

వరదల్లో చీమలు అనేవి చిక్కినప్పుడు ఒకదానికి ఒకటి అల్లుకుంటాయి.ఆ తర్వాత అవి తెప్పలాగా మారిపోతాయి.ఈ విషయాన్నే పరిశోధకులు తెలుసుకున్నారు.చీమలు తెప్ప లాగా తమ నిర్మాణం మార్చుకుంటూ నీటి ప్రవాహంపై తేలుతూ వెల్తాయి.

దీనినే త్రెడ్ మిల్లింగ్ అని పరిశోధకులు కనుగొన్నారు.చీమల బాడీ నీటిని అంటుకోని నిర్మాణం చేసుకుంటుంది.

చీమ శరీరం కూడా బెలూన్‌ లాగా పనిచేస్తుంది.అది నీటిపై తేలుతుంది.

Telugu Float, Floods, Flould, Strength, Unity, Latest-Latest News - Telugu

చీమల్లో రాణి చీమ, కూలి చీమ అనే రెండు రకాలును కంటెయినర్లో ఉంచి టెస్ట్ చేశారు.నీటి ప్రవాహం పెరిగేకొద్దీ ఒకదాని కాళ్లను మరొకటి పట్టుకొని కన్వేయర్ బెల్ట్‌లా చీమల దండు ముందుకు సాగిన వైనం చూసి వారికి నిజంగా ఆశ్చర్యం వేసింది.చీమల తెప్ప నిర్మాణం పొరలాగా ఉండి ఇతర చీమలు ఒక పక్క నుంచి ఇంకోపక్కకు వెళ్లేందుకు రవాణా మార్గాన్ని ఏర్పాటు చేసింది.చీమలు ఇలా రక్షణ పొందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube