ఒక వెదవ చేసిన పనితో ఆమె చేయని తప్పుకు పిల్లలకు, భర్తకు దూరమయ్యి కన్నీరు మున్నీరు అవుతోంది..  

టెక్నాలజీ పెరిగి పోతున్న కొద్ది మనుషుల మద్య దూరం పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు భార్య భర్తల మద్య మంచి అన్యోన్యత ఆప్యాయతు ఉండేవి. కాని స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చిన తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంట్లో ఉన్నా కూడా ఫోన్‌లోనే ఛాటింగ్‌లు చేసుకుంటున్నారు. ఇక కొందరు ఫోన్‌లను మరీ నీచంగా వాడుతున్నారు. కొందరి పరువు తీసేందుకు ఆయుదంగా వాడుతున్నారు. కేరళకు చెందిన ఒక వ్యక్తి చేసిన పనితో ఒక మహిళ జీవితం నాశనం అవ్వడంతో పాటు, పండంటి కాపురం నాశనం అయ్యింది, పిల్లలు అనాధలు అయ్యారు.

How Technology Helped This Mother Of 3 Beat Fake Video-Kerala Sobha Sajju Whatsapp Group

How Technology Helped This Mother Of 3 Beat Fake Video

వివరాల్లోకి వెళ్తే.. కేరళ కొచ్చిలో ఉండే లిట్టో తంకచన్‌ ఒక అశ్లీల వీడియోను వాట్సప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియోలో ఉన్న మహిళ ఎవరు అనే విషయంపై క్లారిటీ లేదు. బట్టలు లేకుండా ఉన్న ఒక మహిళ వీడియో అది. ఆ వీడియోలో ఉన్నది సాజు భార్య శోభ అంటూ పేర్కొన్నాడు. స్థానికుడే అయిన సాజు వరకు ఆ వీడియో వెళ్లింది. తన భార్య శోభ అయ్యి ఉంటుందని ఆయన నిర్థారణకు వచ్చాడు. దాంతో తన ఇద్దరు పిల్లలను తీసుకుని దూరంగా ఉండటం మొదలు పెట్టాడు. మూడు సంవత్సరాలుగా ఆమెతో పిల్లలను కలవనివ్వక పోవడంతో పాటు, తాను కూడా శోభను కలవడం లేదు.

How Technology Helped This Mother Of 3 Beat Fake Video-Kerala Sobha Sajju Whatsapp Group

ఆ వీడియో నిజం కాదని ఫోరెన్సిక్‌ వారు నిర్థారించారు. వీడియోను పోస్ట్‌ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి శిక్ష కూడా విధించారు. అయినా కూడా సాజు మాత్రం తన భార్యను నమ్మడం లేదు. ఆమె మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదని అంటున్నాడు. తనకు విడాకులు కావాల్సిందే అంటూ పట్టుబడుతున్నాడు. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా ఆమెతో మాట్లాడమని చెప్పేస్తున్నారు. దాంతో ఆమె న్యాయపోరాటం చేస్తోంది. తన భర్తను పిల్లలను తనతో కలిసి ఉండాల్సిందిగా ఆదేశించమని ఆమె కోరుతోంది. ఒక పనికిమాలిన వాడి పిచ్చి పని వల్ల ఆమె తన జీవితాన్ని కోల్పోయింది.