ఒక హీరోతో అనుకున్న సినిమా ని మరొక హీరో తో చేయడం ఇప్పటివరకు మనం చాలానే చూసాం.ఇక అందులో భాగంగానే ఒకప్పుడు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న 7/G బృందావన కాలనీ సినిమాని( 7/G Brindavan Colony ) కూడా మొదట డైరెక్టర్ సెల్వరాఘవన్ సూర్యతో గాని,( Surya ) లేదా మాధవన్ తో గాని( Madhavan ) చేద్దాం అని అనుకున్నడట…
కానీ వాళ్లు ఆ టైం కి మిగతా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల వాళ్ళిద్దరూ ఆయనకు డేట్స్ ఇవ్వడం జరగలేదు.
దాంతో సెల్వ రాఘవన్( Selva Raghavan ) వాళ్ల కోసం కొద్ది రోజులు వెయిట్ చేశాడు.ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన ఎ ఏం రత్నం వాళ్ల కోసం వెయిట్ చేయడం ఇష్టం లేక వేరే ఇంకొక హీరోని ఎవరినైనా చూద్దామని డైరెక్టర్ తో చెప్పినప్పుడు ఆయన కూడా వేరే హీరో కోసం వెతుకుతుండగా
ఒకరోజు రత్నం గారు సెల్వ రాఘవన్ తో మా అబ్బాయి ఉన్నాడు మన సినిమాకి ఏమైనా పనిచేస్తాడేమో ఒకసారి చూడండి అని సెల్వ రాఘవన్ కి చెప్పగానే ఆయన అతనికి లుక్ టెస్ట్ చేసి ఆయన ఇన్నోసెంట్ ఫేస్ చూసి పడిపోయి ఈ సినిమాలో ఈయనే హీరో అని చెప్పి ఫిక్స్ చేసి 7/g బృందావన కాలనీ సినిమా తీశాడు.
ఈ సినిమా అప్పట్లో ఒక కల్ట్ మూవీగా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది.అయితే ఈ సినిమాకి ఇప్పటికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.ఇక రీసెంట్ గా రీ రిలీజ్ చేసిన ఈ సినిమాకి రీ రిలీజ్ లో( Re-Release ) కూడా మంచి వసూళ్లు వచ్చాయి.ఇంకా చాలామంది ఇప్పటికి కూడా ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేశారు…అలాంటి ఒక మాస్టర్ పీస్ ఈ సినిమా…
.