పెళ్లి అయ్యాక సుమన్ కోసం ఆ పోలీస్ కూతురు ఏం చేసిందో తెలుసా ?

హీరో గా కెరీర్ ని ప్రారంరంబించి అనతి కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అందగాడిగా, మంచి నటుడిగా ఎదిగాడు సుమన్.సుమన్ ఎదుగుతున్న సమయంలో కొన్ని కారణాల చేస్తా జైలు పాలైన సంగతి కూడా తెలిసిందే.

 How Suman Get Arrested Details, Suman , Hero Suman , Suman Arrested, Police Offi-TeluguStop.com

అయితే జైలు కు వెళ్ళడానికి సుమన్ చేసిన తప్పేంటో సుమన్ తో పాటు చాలా మందికి తెలియదు.అమీర్ పెట్ లో సుమన్ స్నేహితుడికి ఉన్న ఒక క్యాసెట్ షాప్ ని ఆధారం చేసుకొని నీలి చిత్రాల కేసు అని చెప్పి, కేసు కూడా ఫైల్ చేయకుండా, కోర్ట్ లో హాజరు పరచకుండా మూడేళ్ళ పాటు ఒక జైలు గదికి పరిమితం చేసారు.

చివరికి సుమన్ తల్లి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి కొడుకుని బయటకు తెచ్చుకుంది.తమిళ్ నాడు రాష్ట్ర గవర్నర్ సుమన్ తల్లికి క్లాస్ మేట్ అవ్వడం వల్ల విషయం అర్ధం చేసుకొని సుమన్ ని బెయిల్ మీద బయటకు తేగలిగారు.

సుమన్ విడుదల అయినా కూడా ప్రతి రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం చేయాల్సి వచ్చింది.కొన్ని నెలల పాటు వూరు దాటి బయటకు వెళ్ళకూడదు అనే షరతు కూడా పెట్టారు.

Telugu Suman, Suman Mother, Suman Friend, Suman Jail, Tollywood-Movie

ఇక సుమన్ జైలు కి వెళ్ళడానికి ప్రధాన కారణం చెన్నై లో ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు. సదరు అమ్మాయికి పెళ్ళై భర్త తో కాపురం చేస్తూనే సుమన్ అంటే పిచ్చి ప్రేమ పెంచుకుంది.సుమన్ షూటింగ్ ఎక్కడికి ఉంటె అక్కడికి పోలీస్ ఎస్కార్ట్ తో వెళ్లిపోయేది.అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ కూతురు పెళ్లయ్యాక ఇలా ఒక హీరో కోసం ప్రతి రోజు వెళ్లిపోవడం ఆయనకు నచ్చలేదు.

అసలు ఈ విషయం సుమన్ కి కూడా తెలియదు.పూర్తిగా వన్ సైడ్ లవ్.

Telugu Suman, Suman Mother, Suman Friend, Suman Jail, Tollywood-Movie

కానీ సుమన్ ని మాత్రం ఈ విషయం లో బలి పశువుని చేసి ఒక చిన్న దొంగ కేసు పెట్టి అరెస్ట్ చేసి అతడిని పూర్తిగా హీరో గా ఎదగకుండా బయటకు రాకుండా ఉండేందుకు విశ్వా ప్రయత్నాలు చేసారు.కానీ నిజం ఎప్పుడు నిప్పు లాంటిది.అది ఎప్పటికైనా దావాగ్నిలా దహించి వేస్తుంది.సుమన్ కూడా ఒక అమ్మి పిచ్చి ప్రేమకు అతడి తప్పు లేకపోయినా బలై, చివరికి ఆ కేసు నుంచి బయట పడి తిరిగి మామూలు జీవితం మొదలు పెట్టాడు.

సినిమా ఇండస్ట్రీ మొత్తం సుమన్ అమాయకుడు అని నమ్మింది.ఈ తప్పులో చిరంజీవి కూడా నిందలా పాలయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube