ఎన్టీఆర్ కు చుట్ట తాగడం నేర్పించింది.. ఆ విలనేనట?

నటసార్వభౌముడుగా  తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్.ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్థానం అలాగే నిలిచిపోయింది.

 How Sr Ntr Learnt Smoking Because Of This Villain Mukkamula Krishna Murthy Detai-TeluguStop.com

అయితే ఒకప్పుడు స్టార్ హీరో గా కొనసాగిన ఎన్టీఆర్ కూ చుట్ట తాగే అలవాటు ఉంది అన్న విషయం తెలిసిందే.ఇక ఈ విషయాన్ని ఏకంగా ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఒకానొక సందర్భంలో ఏకంగా మీడియా ముందు వెల్లడించారు.

తండ్రి లాగానే తనకు కూడా చుట్ట తాగే అలవాటు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.అయితే బాలకృష్ణ కు అయితే తండ్రి ఎన్టీఆర్ ను చూసి చుట్ట తాగడం నేర్చుకున్నాడు.

మరి ఎన్టీఆర్ కు చుట్ట తాగడం ఎవరు నేర్పించారు.అసలు ఆ అలవాటు ఎలా వచ్చింది అన్నది మాత్రం చాలా మందికి తెలియదు.

ఒక విలన్ ఎన్టీఆర్ కు  చుట్ట తాగడం నేర్పించాడట.ఆ విలన్ ఎవరో కాదు ముక్కామల కృష్ణమూర్తి.

కేవలం కళ్ళల్లోనే విలనిజాన్ని చూపిస్తూ ప్రేక్షకులందరినీ భయపెట్టి తన నటనతో మెప్పించిన ముక్కామల ఆర్టిస్టుగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు.వందలాది చిత్రాల్లో విలన్ గా  నటించి ఎంతో మంది స్టార్ హీరోలను ఢీకొట్టారు ముక్కామల.

స్టార్ హీరోలకు ఎక్కడా తీసిపోకుండా ఈయన విలన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించేవారు.ఇక ఆయన 1987లో తుదిశ్వాసవిడిచారు.

ఇక చివరి రోజుల్లో కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.మొత్తంగా మూడు వందల చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు.

Telugu Balakrishna, Jaggayya, Maradali Pelli, Senior Ntr, Sr Ntr, Tollywood, Vil

అయితే అప్పట్లో విలన్ ముక్కామల కు ఎన్టీఆర్ కు మధ్య మంచి స్నేహ బంధం ఉండేదట.ఈ క్రమంలోనే ముక్కామల కు చుట్ట తాగే అలవాటు కూడా ఉండేదట.ఇక అదే అలవాటును అటు ఎన్టీఆర్ కూడా నేర్పించారు ఆయన.అయితే ముక్కామల, ఎన్టీఆర్ స్నేహబంధం సినిమాల్లోకి వచ్చిన తర్వాత కాదు కాలేజీ రోజుల నుంచే ఎన్టీఆర్, ముక్కామల, జగ్గయ్య ముగ్గురు కలిసి నాటకాలు కూడా వేసేవారట.అయితే ఇక ఎన్టీఆర్ కు  చుట్ట తాగడం నేర్పించిన తర్వాత ఎన్టీఆర్ ముక్కామల ను ధూమపాన గురువుగారు అంటూ సరదాగా కామెంట్ చేసేవారట.

Telugu Balakrishna, Jaggayya, Maradali Pelli, Senior Ntr, Sr Ntr, Tollywood, Vil

అయితే కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా సత్తా చాటారు ముక్కామల.ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన మరదలు పెళ్లి లాంటి చిత్రాలలో ఎంతో మంచి భావుకథ ఉన్నప్పటికీ ఆర్థి కంగా మాత్రం నిరాశ మిగిల్చాయి.ఇలా ఒక వైపు వేషాలు తగ్గడం మరోవైపు నిర్మాతగా కూడా నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముక్కామల ను ఎన్టీఆర్ ఆదుకున్నాడట.

ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆయనకు ఎన్టీఆర్ సహాయం చేశారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube